దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే. నేడు కూడా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. సోమవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696కు చేరుకుంది.
గడచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా కారణంగా 771 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 38,136 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులున్నాయి. 11,86,203 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ దేశంలో 2,02,02,858 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments