Justin Trudeau:ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ .. కెనడా ప్రధాని ట్రూడో సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్ - కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన చేశారు. భారత ప్రభుత్వ ఏజెంట్లకు , నిజ్జర్ హత్యకు మధ్య సంబంధం వుందంటూ ఆరోపించారు. హర్దీప్ సింగ్ నిజర్ ఈ ఏడాడి జూన్‌లో బ్రిటీష్ కొలంబియాలోని ఒక ఆలయం వెలుపల ఆయనను కాల్చి చంపారు. దీని వెనుక భారత ప్రభుత్వ కుట్ర వుందని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి కెనడాలో ఖలిస్తానీయుల దూకుడు కూడా పెరిగింది.
జీ20 సమావేశాల్లో అంటీముట్టనట్లుగా ట్రూడో :
గత వారం జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెనడాలో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు మోడీ. ముఖ్యంగా ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో ట్రూడో ముభావంగా కనిపించారు. జీ20 లీడర్ల సమ్మిట్‌లోనూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. ఆ వెంటనే భారత్ - కెనడా మధ్య వాణిజ్య చర్చలు సైతం వాయిదా పడ్డాయి.
కెనడాలో మన పౌరుడిని చంపడం ఏంటీ : ట్రూడో
అయితే హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి భారత్‌కు సంబంధం వుందని కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వ ఏజెంట్లకు, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు మధ్య సంబంధం వుందనే ఆరోపణలను కెనడా భద్రతా సంస్థలు చురుగ్గా పరిశీలిస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వ ఆందోళనున భారత భదత్ర, ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేసిందని ట్రూడో వెల్లడించారు. కెనడా భూభాగంలో , కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం వుండటం మన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తామని, భారత్ సహకారాన్ని కూడా కోరినట్లు ట్రూడో వెల్లడించారు.
తీవ్రంగా స్పందించిన భారత్ :
అయితే ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. కెనడా ప్రధాని చేసిన ప్రకటనను, వారి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. కెనడాలో జరుగుతున్న హింస వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుందంటూ ట్రూడో చేసిన ఆరోపణలు అసంబద్ధం, ప్రేరేపితమని విదేశాంగ శాఖ పేర్కొంది. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించి.. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా మార్చారని మండిపడింది. తీవ్రవాద గ్రూపుల నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments