కరోనాపై పోరు: అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా దేశాల్లో లెక్కలేనంత మంది చనిపోతున్నారు. ఈ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు తేల్చిచెబుతున్నా.. మరికొన్ని మాత్రం దొంగలెక్కలు చెప్పేస్తున్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా అయిపోతున్నాయ్. అమెరికాలాంటి అ్రగరాజ్యంలో అయితే రోజుకు 15వేల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరణాల సంఖ్య అయితే రోజుకు ఎంతో.. చనిపోయినవారిని పూడ్చడానికి కూడా ఎవరూ దొరకని పరిస్థితుల్లో అమెరికా విలవిలాడుతోంది. మరోవైపు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో అయితే మరీ ఘోరం.

అగ్రరాజ్యం పరిస్థితి ఇదీ..

పైన చెప్పిన దేశాలన్నింటిలోనూ వైరస్ బారిన ఎక్కువ మంది పడటానికి ఏకైక కారణం ‘నిర్లక్ష్యం’. ‘ఏం జరుగుతుందిలే..? మనదాకా వచ్చాక చూద్దామం’ అని ఈ మహమ్మారి వ్యాప్తిని చాలా సింపుల్‌గా తీసుకున్నారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకపోవడంతోనే అమెరికాలో ఇప్పటి వరకూ www.worldometers.info/coronavirus/ ప్రకారం 501,272 పాజివ్ కేసులు నమోదయ్యాయి. 18,666 మంది కరోనా మృత్యువాత పడ్డారు. 27,239 మంది మాత్రమే కోలుకుంటున్నారు. అమెరికా జనాభా మొత్తం తిప్పికొడితే 32.72 కోట్లు మాత్రమే. వీరిలో ఇప్పటికే ఐదులక్షల మందికి కరోనా సోకిందంటే.. మున్ముంథు పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు ఊహకందట్లేదు. అన్నెన్ని మాటలు చెబుతున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంతసేపు వివాదాలతోనే గడిపేస్తున్న ఆయన ప్రజలను రక్షించడం కోసం ఏమేం చేస్తున్నారు..? అసలు ఆయన మనసులో ఏముంది..? అనేది తెలియట్లేదు. అమెరికా వాళ్ల పరిస్థితే అలా ఉంటే.. అక్కడ ఉంటున్న మన భారతీయులను పట్టించుకునే నాథుడెవరు..?.

ఇండియా విషయానికొస్తే..

కరోనాను కట్టడి చేయడంలో నిజంగానే ఇండియా కష్టపడినంతగా ఏ దేశమూ శ్రమించట్లేదేమో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశ జనాభా 133.92 కోట్లకు పై చిలుకే. అలాంటిది కరోనా వ్యాపిస్తోందని తెలియగానే ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాలను నిలిపేయడం.. ప్రజా రవాణా పూర్తిగా ఆపేయడం.. దేశమంతా లాక్‌డౌన్ విధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోరాడాయి. ఇలా చేయడం వల్ల 133.92 కోట్ల జనాభాలో కేవలం 7,598 మందికి మాత్రమే కరోనా సోకింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారు, నిజాముద్దీన్ ఘటనతో 246 మంది చనిపోయారు. నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేసేదేమో అని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

మనం చాలా బెటరేగా..

అంటే అగ్రరాజ్యంతో పొలిస్తే.. మన ఇండియా నిజంగా గ్రేట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. కొందరు అమెరికా, ఇటలీ ఇలాంటి దేశాల్లో ఉన్న భారతీయులు ముఖ్యంగా తెలుగు ప్రజలు అక్కడ్నుంచి వీడియోల రూపంలో స్పందన చూస్తే బాధేస్తోంది. పోరులో భాగంగా నిజంగా ఇండియా తీసుకుంటున్న చర్యలను చూస్తే.. టూ గ్రేట్ అనిపిస్తోంది. అక్కడ వారిని పట్టించుకునే నాథుడే లేక విలవిలలాడిపోతున్నారట. అక్కడ ఇబ్బందులు పడుతున్న మన భారతీయులను సైతం అగ్రరాజ్యం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్నేహ హస్తం..

అంతేకాదు.. కరోనాపై పోరులో భాగంగా వివిధ దేశాలకు మన దగ్గరుండే కరోనా పోరులో పనిచేసే హైడ్రాక్సి క్లోరోక్విన్‌కు కూడా ఎగుమతి చేయడంలో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిజంగా ఇది చాలా మంచి పరిణామం. వాస్తవానికి మనం ఆపదలో ఉన్న మిత్రుడ్ని ఎలా ఆదుకోవాలని ఆలోచిస్తామో.. అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు దేశాలు కూడా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి కలిసికట్లుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే భారత్ పెద్ద మనసు చేసుకుని హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను అన్ని దేశాలకు ఎగుమతికి అంగీకరించింది. మొత్తానికి చూస్తే.. అగ్రరాజ్యం కంటే ఇండియా చాలా బెటర్..!.. సాహో ఇండియా.. సాహో..!

More News

చిరు ట్వీట్‌కు తెలంగాణ డీజీపీ ఇంట్రెస్టింగ్ రిప్లయ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని నిర్మూలించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఓ వైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై ప్రముఖులు ప్రశంసల జల్లు

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

రామ్‌చ‌ర‌ణ్‌ హీరోయిన్ ఇప్పుడు బన్నీకి స్పెషల్

టైటిల్ చ‌దివిన త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే. వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు ఏం చేసుకున్నారు? అనే సందేహం రావ‌చ్చు.

కన్న‌డ‌లో రీమేక్‌కానున్న అడివి శేష్ చిత్రం..?

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల ట్రెండ్ మారింది. డిఫరెంట్ సినిమాలు రూపొందుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయ‌డానికి హీరోలు, చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు.

లేడీ విలన్‌తో బాలయ్య ఢీ..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా