Mahabharatam Movie : సౌత్ స్టార్స్ మహాభారతం చేస్తే.. ఏ రోల్ ఎవరికంటే, వీడియో వేరేలెవల్ అసలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇతిహాసలైన రామాయణం, మహాభారతాలు భారతీయులకి తరాలు మారినా, యుగాలు గడిచినా స్పూర్తిగా నిలుస్తాయి. మనిషి ఎలా వుండాలి..? రాజు ఎలా పాలించాలి..? భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితుల మధ్య ఎలాంటి రిలేషన్ వుండాలనే దానిపై ఈ రెండు గ్రంథాల్లో బోలెడన్నీ ఉదాహరణలు. కానీ రామాయణం కంటే మహాభారతానికే జనంలో క్రేజ్ ఎక్కువ. తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి అని పెద్దలు అంటూ వుంటారు.
అన్ని ఇండస్ట్రీల డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం:
మహాభారతం విస్తృతమైన కథాంశం. ఇందులో లెక్కకు మిక్కిలిగా పాత్రలు, కథలు, ఉపకథలు వుంటాయి. అలాంటి మహాభారతం వెండితెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమైంది. కానీ ఎన్నిసార్లు తీసినా, చూసినా మహాభారతం ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అందుకే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా వివిధ పరిశ్రమలకు చెందిన మేకర్స్ మహాభారతాన్ని తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా ఎన్నోసార్లు చెప్పారు. ఇక భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని ఎన్నోసార్లు చెప్పారు. డైరెక్టర్‌గా రిటైర్ అయ్యే లోపు ఈ అద్భుత కావ్యాన్ని తెరకెక్కిస్తానని జక్కన్న తెలిపారు. ప్రస్తుత జనరేషన్‌కి తగ్గట్టుగా, సరికొత్త టెక్నాలజీతో మహాభారతాన్ని రూపొందించాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
కృష్ణుడిగా మహేశ్... దుర్యోధనుడిగా ప్రభాస్:
ఇకపోతే.. దక్షిణాదిలోని స్టార్ హీరోలు మహాభారతంలోని పాత్రలు చేస్తే ఎలా వుంటుంది అనే ఉద్దేశంతో ఓ ఔత్సాహితుడు చేసిన మార్ఫింగ్ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ ఫోటోలు, మన స్టార్స్ గెటప్స్ కూడా అద్భుతంగా కుదరడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏ స్టార్‌కి అతను ఏ పాత్ర ఇచ్చాడో చూస్తే. కృష్ణుడిగా మహేశ్‌బాబు, దుర్యోధనుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జునుడిగా సూర్య, కర్ణుడిగా విక్రమ్, భీముడిగా మాధవన్, ధృతరాష్ట్రుడిగా జయం రవి, భీష్ముడిగా కమల్‌హాసన్, ద్రోణాచార్యుడిగా రజనీకాంత్, ద్రౌపదిగా అసిన్, కుంతీగా అనుష్క శెట్టి, యుధిష్టరుడిగా విజయ్, శకునిగా కార్తీ, గాంధారి దేవిగా నయనతార, సుభద్రగా సమంతలకు రోల్స్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout