ఐందవి ఆడియో విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీధర్ నిర్మాత. ఎస్ఏ అర్మాన్ సంగీతాన్ని అందించిన ఐందవి పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ...కొందరు యువతీ యువకులు సరదాగా వెళ్లిన పర్యటన వాళ్లను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోకి చేరేలా చేసింది అనేది ఐందవి సినిమా కథాంశం. సప్సెన్స్ థ్రిల్లర్ తరహాలో చిత్రం సాగుతుంది. నేటి యువతకు కావాల్సిన అంశాలుంటాయి. చివరగా మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దు అనే సందేశాన్ని చెబుతున్నాం. పాటలు గీతా మాధురి, హరిణి, హేమచంద్ర లాంటి పేరున్న గాయనీ గాయకులు పాడారు. ఎస్ఏ అర్మాన్ మంచి మెలొడీలను అందించారు. హార్రర్ చిత్రాల్లో ఐందవి మరో స్థాయిని చేరుకుంటుందని నమ్మకముంది. అన్నారు.
నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ....నేటి ట్రెండ్ కు తగినట్లు ఉండే సినిమా ఇది. ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాను అనుసరించిన ఈ సినిమాను నిర్మించాం. ఒక ఆసక్తికరమై కథను ఐందవి చిత్రంలో చూస్తారు. అతీంద్రియ శక్తులు, హార్రర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు మా సినిమా బాగా నచ్చుతుంది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు. అతిథిగా పాల్గొన్న నటుడు కాదంబరి కిరణ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే గౌడ్, సాయి వెంకట్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.దిలీప్, అవంతిక, చిత్రం శీను, ఛత్రపతి శేఖర్, ప్రమీలా, బాలాజీ, కీర్తన తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - భరత్ సి కుమార్, సాహిత్యం - ఏఎస్ రావు, ఎడిటర్ - మేనగ శ్రీను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com