తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. నిన్న కొత్తగా 879 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3006 శాంపిల్స్‌ను పరీక్షించగా 879 పాజిటివ్‌గా తేలాయి. వీటిలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. ఇక్కడ ఏకంగా 652 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా.. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణను కలవరపరుస్తున్న అంశం ఇదే. పాజిటివ్ రేటు ఏప్రిల్‌లో కేవలం 5.9 ఉండగా.. మేలో 14.31.. జూన్‌కి వచ్చే వరకూ 21.58కి చేరుకుంది. కాగా.. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 2290 టెస్టులు చేసే సామర్థ్యమే ఉంది. మరో వారం పదిరోజుల్లో వాటి సామర్థ్యం రోజుకు 6600లకు పెరగొచ్చు. ఆ సమయంలో కేసుల సంఖ్య మరింత పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments