తెలంగాణ: పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. తాజాగా.. మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌కు ఇండోనేషియా బృందం రావడంతో జిల్లా వాసులకు లేనిపోని తలనొప్పులు వచ్చిపడ్డాయి. వారి వల్లే కరీంనగర్‌లో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తేల్చారు.
రాష్ట్రానికి లండన్ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకిందని, ఫ్రాన్స్ నుంచి వచ్చిన మరో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. కరీంనగర్ జిల్లాలోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ వాసికి మొదటి కేసు నమోదైంది. పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని కరీంనగర్ నుంచి గాంధీ ఆసుపత్రికి వైద్య అధికారులు తరలించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్లూహెచ్‌వో) హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments