రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు.. వాట్ నెక్స్ట్!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. ఇండియాలో అంత లేదు కానీ.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే అసలు లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉందా..? లేదా..? అనే సందేహాలూ కలుగుతున్నాయి. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటేనే పరిస్థితి ఇలా ఉందే.. మే-03 తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటుంటేనే అస్సలు ఊహకందట్లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో. దీన్ని బట్టి చూస్తే లాక్‌డౌన్ కాకుండా ఇంకా ఏదో చేయాలనే తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..:
ప్రపంచవ్యాప్తంగా 20,81,763 కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 1,34,508 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 5,09,880 మంది బాధితులు
కేసుల లెక్కలు ఇవీ..:
అమెరికాలో 6,44,055 పాజిటివ్ కేసులు.. 28,526 మంది మృతి
స్పెయిన్‌లో 1,80,659 పాజిటివ్ కేసులు.. 18,812 మంది మృతి
ఇటలీలో 1,65,155 పాజిటివ్ కేసులు.. 21,645 మంది మృతి
ఫ్రాన్స్‌లో 1,47,863 పాజిటివ్ కేసులు.. 17,167 మంది మృతి
జర్మనీలో 1,34,753 పాజిటివ్ కేసులు.. 3,804 మంది మృతి
యూకేలో 98,476 పాజిటివ్ కేసులు.. 12,868 మంది మృతి
చైనాలో 82,295 పాజిటివ్ కేసులు.. 3,342 మంది మృతి
ఇరాన్‌లో 76,389 పాజిటివ్ కేసులు.. 4,777 మంది మృతి
బెల్జియంలో 33,573 పాజిటివ్ కేసులు.. 4,440 మంది మృతి
నెదర్లాండ్స్‌లో 28,153 పాజిటివ్ కేసులు.. 3,134 మంది మృతి
ఇండియాలో పరిస్థితి చూస్తే..:
కరోనా పాజిటివ్ కేసులు : 12,456
మరణాలు : 423
గడిచిన 24 గంటల్లో : 941 కొత్త కేసులు, 37 మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 2,916 కేసులు
ఢిల్లీలో 1500 దాటిన కరోనా కేసులు
తమిళనాడు 1242.. రాజస్తాన్‌లో 1023 కేసులు నమోదయ్యాయి అని www.worldometers.info వెబ్‌సైట్‌లో తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments