ఇళయ దళపతి విజయ్ బంధువు , నిర్మాత బ్రిట్టో ఇంట్లో ఐటీ దాడులు

  • IndiaGlitz, [Thursday,December 23 2021]

తమిళ అగ్ర కథానాయకుడు , ఇళయ దళపతి విజయ్‌ బంధువు, నిర్మాత జేవియర్‌ బ్రిట్టో ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు చేశారు. చెన్నై, శ్రీపెరంబదూరులోని పలు సెల్‌ఫోన్‌ సంస్థలపై మంగళవారం సాయంత్రం నుంచి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. బుధవారం ఉదయం అడయార్‌లోని జేవియర్‌ బ్రిట్టో నివాసం, చెన్నై కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. సెల్‌ఫోన్‌ సంస్థల్లో జరిపిన సోదాల్లో లభించిన సమాచారంతోనే ఆయన ఇంట్లో దాడులు జరిగినట్లు సమాచారం. విజయ్‌ బంధువైన బ్రిట్టో మాస్టర్‌ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆయనకు తమిళనాడులో పలు ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలు ఉన్నాయి. హార్బర్‌ల ద్వారా అనేక దేశాలకు వివిధ ఉత్పత్తులను వాటి ద్వారా తరలిస్తున్నారు

ఇకపోతే లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా నటించారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తమిళ్‌తోపాటు తెలుగులోనూ మాస్టర్ దుమ్ములేపింది. ప్రస్తుతం విజయ్ ‘‘ బీస్ట్‌ ’’ చిత్రంలో నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే .. ఈ మూవీతోనే తమిళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఈసినిమా.. ఏప్రిల్‌కు వెళ్లినట్లు కోలీవుడ్ టాక్.