టిప్ టాప్‌గా ‘టిక్ టాక్’ను బ్యాన్ చేశారు!
Send us your feedback to audioarticles@vaarta.com
చైనీస్ యాప్ ‘టిక్ టాక్’ను అక్కడి వారు ఎంతవరకూ ఉపయోగిస్తున్నారో తెలియదు కానీ.. ఇండియాలో మాత్రం దీనిని వినియోగిస్తున్నవారి సంఖ్య బహుశా కోట్లలోనే ఉండొచ్చు. ఇంటి ఇంటికీ డైలీ సీరియల్లా పాకి పోయింది. ఇటీవల భారత్‌కి చెందిన కొందరు సైనికులను చైనా మట్టుబెట్టడమే కాకుండా.. నాటి నుంచి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో చైనీస్ యాప్స్‌తో పాటు ప్రాడక్ట్స్‌ని బ్యాన్ చేయాలంటూ ఇండియాలో పలువురి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించింది.
గూగుల్ ప్లే స్టోర్లలో ఇకపై ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. దీంతో కొత్త యూజర్స్‌కి డౌన్లోడ్ చేసుకోవడానికి అవదు.. పైగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటివేమీ సాధ్యపడవు. ఇప్పటికే అన్ని ఇంటర్నెట్ ప్రొవైడర్స్‌కి చైనాకి సంబంధించిన 59 యాప్స్‌ని బ్లాక్ చేయాలని గవర్నమెంట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గూగుల్, ప్లే స్టోర్ దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించాయి. కాగా.. యాప్స్‌పై గవర్నమెంట్ నిషేధం దీంతో పూర్తయినట్టు కాదని తెలుస్తోంది. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరకేకంగా ఎలాంటి యాప్స్ కనిపించినా వాటిపై నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments