అనంతపురంలో ఘోరం.. వెలుగులోకి దిశ తరహా ఘటన..

  • IndiaGlitz, [Wednesday,December 23 2020]

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే దిశ ఘటన జరిగిన ప్రదేశంలోనే నిందితులందరూ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అయినప్పటికీ మృగాళ్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కాగా.. తాజాగా దిశ తరహా ఘటనే అనంతపురంలోనూ చోటు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అనంతపురంలో యువతిని దారుణంగా హత్య చేసి తగులబెట్టేశారు.

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి దారుణహత్యకు గురైంది. యువతిని హత్య చేసి దుండగులు తగులబెట్టారు. ఉదయం పొలాల్లో సగం కాలిన యువతి మృతదేహం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో యువతికి సంబంధించిన ఐడెంటి కార్డు, హ్యాండ్ బ్యాగ్ లభించాయి. వీటి ఆధారంగా హతురాలు.. అనంతపురం నగరానికి చెందిన స్నేహలతగా గుర్తించారు.

కాగా.. స్నేహలత కనిపించడం లేదంటూ నిన్న పోలీసు స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే దారుణం వెలుగు చూసింది. అయితే స్నేహలతను ఎందుకు హత్య చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే స్నేహలత తల్లిదండ్రులు మాత్రం కార్తీక్, రాజేశ్ అనే వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్నేహలత హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

More News

రియల్ లొకేషన్స్‌కే మహేశ్ మొగ్గు.. !

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాటస‌. ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

క‌రోనా ఎఫెక్ట్.. అణ్ణాత్తే షూట్యింగ్ క్యాన్సిల్‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం అణ్ణాత్తే. స‌న్‌పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉంది. మరోవైపు జగన్ సర్కార్..

తల్లి గర్భంలో మైక్రో ప్లాస్టిక్.. వైద్య చరిత్రలో ఇదే తొలిసారి..

ప్లాస్టిక్ గురించి ఎన్ని చెప్పినా మనుషుల మెదడులోకి మాత్రం ఎక్కడం లేదు. పర్యావరణానికి తీవ్ర విఘాతం సృష్టిస్తున్న ఈ ప్లాస్టిక్ ప్రస్తుతం మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయింది.

సూపర్ హిట్ రీమేక్‌లో హీరోగా సునీల్...

హాస్యనటుడిగా కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ.. హీరోగా మారి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి.. అనంతరం ఆ పాత్ర..