అనంతపురంలో ఘోరం.. వెలుగులోకి దిశ తరహా ఘటన..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే దిశ ఘటన జరిగిన ప్రదేశంలోనే నిందితులందరూ ఎన్కౌంటర్లో మరణించారు. అయినప్పటికీ మృగాళ్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కాగా.. తాజాగా దిశ తరహా ఘటనే అనంతపురంలోనూ చోటు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అనంతపురంలో యువతిని దారుణంగా హత్య చేసి తగులబెట్టేశారు.
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి దారుణహత్యకు గురైంది. యువతిని హత్య చేసి దుండగులు తగులబెట్టారు. ఉదయం పొలాల్లో సగం కాలిన యువతి మృతదేహం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో యువతికి సంబంధించిన ఐడెంటి కార్డు, హ్యాండ్ బ్యాగ్ లభించాయి. వీటి ఆధారంగా హతురాలు.. అనంతపురం నగరానికి చెందిన స్నేహలతగా గుర్తించారు.
కాగా.. స్నేహలత కనిపించడం లేదంటూ నిన్న పోలీసు స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే దారుణం వెలుగు చూసింది. అయితే స్నేహలతను ఎందుకు హత్య చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే స్నేహలత తల్లిదండ్రులు మాత్రం కార్తీక్, రాజేశ్ అనే వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్నేహలత హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com