బిగ్‌బాస్ హౌస్‌లో బస్తీమే సవాల్.. ఇనయా vs ఫైమా, చివరికి

ఇప్పటి వరకు చప్పగా సాగి, విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మాటలు పడ్డ బిగ్‌బాస్ 6 తెలుగు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. వారం వారం గడిచేకొద్ది టఫ్‌గా మారుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సూర్య, గీతూల ఎలిమినేషన్‌ల ద్వారా సరిగ్గా ఆడకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపుతామనే మెసేజ్ బిగ్‌బాస్ ఇవ్వడంతో ఇంటి సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతున్నారు. ఇక నిన్న నామినేషన్స్ సందర్భంగా గొడవలు, వాదోపవాదాలు గట్టిగానే జరిగాయి. ఇలా ఇంటి సభ్యులంతా మంచి ఊపులో వున్న వేళ కెప్టెన్సీ కంటెండర్ల పోటీని మొదలెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా పాము నిచ్చెన అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంటిలో ఒక మూల వేర్ హౌస్ నిర్మించారు. అందులో మట్టి వుంటుంది.. దానిని తీసుకొచ్చి హౌస్‌మేట్స్‌లో సగం మంది నిచ్చెనలు కట్టాలి... మిగిలిన సగం మంది పామనును నిర్మించాలి. గత వారం మాదిరే ఇంటి సభ్యులు ఫిజికల్‌గా తలపడేలా గేమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా పాము బుస్ అంటూ శబ్ధం వచ్చినప్పుడు పాము బొమ్మలు నిర్మించిన వారిలో ఒకరు.. నిచ్చెనలు కట్టిన వారిలోని ఒకరిని ఎంచుకుని వారు నిర్మించిన నిచ్చెనలోంచి మట్టిని లాక్కోవాల్సి వుంటుంది.

గేమ్ స్టార్ట్ కాగానే కీర్తి ఇబ్బందిపడుతూ కనిపించింది. ఆమె వేలు విరగడంతో మట్టిని తీసుకురాలేక విలవిలలాడిపోయింది. గత వారంతో పాటు ఈ వారం కూడా టాస్క్‌లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయానంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో ఇంటి సభ్యులు ఆమెను ఓదార్చారు. ఇక ఫిజికల్ టాస్క్‌ల్లో విశ్వరూపం చూపించే రేవంత్ ఎప్పటిలాగే దూకుడుగా ఆడాడు. ఎవరు ఏమనుకున్నా సరే తాను ఇష్టం వచ్చినట్లు ఆడతానని ముందే చెప్పడంతో .. అందరినీ దాటుకుంటూ మట్టిని తీసుకురావడంలో తానే ముందున్నాడు. తన వాళ్లు అనుకున్న వారికి కొంచెం మట్టి ఇచ్చాడు.

ఇదిలావుండగా.. ఈరోజు ఇనయా- ఫైమాల మధ్య జరిగిన ఫైట్ ఎపిసోడ్‌కే నిలిచింది. షో మొదలైన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఇనయా, ఫైమాలు మంచి స్నేహితుల్లాగా వుంటూ వచ్చారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సూర్య ఎలిమినేట్ అయినప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గత వారం కెప్టెన్సీ టాస్క్ వీరిద్దరి మధ్య మరింత గ్యాప్ పెంచేలా చేసింది. తనను కాదని శ్రీసత్య కెప్టెన్‌ అయ్యేలా ఫైమా సహకరించిందని ఇనయా కాస్త ఫీలయ్యినట్లుగా వుంది. ఈరోజు పాము - నిచ్చెన టాస్క్ సందర్భంగా వేర్వేరు జట్లలో వున్న వీరిద్దరూ పోరాడారు. తాను కట్టిన నిచ్చెన నుంచి మట్టిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఫైమాను ఇనయా ఇడ్చిపడేసింది. అటు ఫైమా కూడా తన ఇనయా తన మట్టిని తీసుకోనివ్వకుండా ఉడుం పట్టు పట్టింది.

ఇద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు ఇక్కడే ఇనయాదే పైచేయిగా వుంది. అయితే పరిస్ధితి చేయి దాటేలా వుండటంతో ఇనయాను హెచ్చరించాడు రేవంత్. కానీ ఆ తీరుతో ఆమె గేమ్ నుంచి ఔట్ అయ్యింది. దీనికి నొచ్చుకున్న ఇనయా.. ఈ హౌస్‌లో వరస్ట్ గేమర్ ఫైమా అంటూ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. ఏం తినకుండా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. ఇక వాసంతి మట్టిని తీసుకోవడానికి శ్రీసత్య ప్రయత్నించగా ఆమెను కదలకుండా పట్టేసింది వాసంతి. ఈ గేమ్‌లో బాలాదిత్య కూడా ప్రత్యర్ధి టీమ్‌లో నుంచి మట్టిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఎపిసోడ్ ముగిసే సరికి గేమ్ ముగిసినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. కానీ విజేత ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. బహుశా రేపు ప్రకటించే అవకాశం వుంది. అయితే మన రివ్యూస్టార్ ఆదిరెడ్డి మాత్రం ఎందుకో ఈ రోజు మూడీగా కనిపించాడు. ఎవరిని కలవకుండా.. తన పని తాను చేసుకుపోయాడు. తన ఫ్రెండ్ గీతూ గురించి అతను ఆలోచిస్తూ బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

More News

Dahini: స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో రాజేష్ టచ్‌రివర్ 'దహిణి'

తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన సినిమా 'దహిణి'.

Yedi Nijam Naa Preyasi: 'ఏది నిజం నా ప్రేయసి' ఆల్బమ్ సాంగ్ చిత్రీకరణ

వెండితెరపై కోట్లు ఖర్చుపెట్టి సెట్లు వేసి, హంగులు ఆర్భాటలతో డైరెక్టర్లు ఒక పాటను చిత్రీకరిస్తారు.

Nachindi Girl Friendoo: 'నచ్చింది గాళ్ ఫ్రెండూ' మూవీ సెన్సార్

ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ నాయికగా నటిస్తోంది.

Amigos: 'అమిగోస్'.. ఫిబ్రవరి 10న రిలీజ్

టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.

Guru Pawan: 'నచ్చింది గాళ్ ఫ్రెండూ' థ్రిల్లింగ్ లవ్ స్టోరి - దర్శకుడు గురు పవన్

ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ నాయికగా నటిస్తోంది.