Inaya Sultana Bigg Boss: బిగ్‌బాస్ షోతో బాగానే సంపాదించిన ఇనయా.. 14 వారాలకు ఎంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 (Bigg Boss 6 Telugu) తెలుగులో అందరికీ కనెక్ట్ అయిన కంటెస్టెంట్ ఇనయా సుల్తానా (Inaya Sultana). టాప్ 5లో ఖచ్చితంగా వుంటుందని, వీలైతే విన్నర్‌గా కూడా నిలుస్తుందని అంతా భావించిన ఇనయా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 6 సీజన్‌లో పస లేకున్నా కొంతమంది కంటెస్టెంట్స్ తమ భుజాలపై షోను మోసుకొచ్చారు. వీరిలో ఇనయా కూడా ఖచ్చితంగా వుంటుంది. మొదటి వారం నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ఇనయా పోరాటం చేసింది. ఒకానొక సమయంలో ఇంటి సభ్యులంతా ఒక్కటై ఇనయాను టార్గెట్ చేసిన సందర్భాలు ఎన్నో. బాధపడినప్పుడు ఒంటరిగా ఏడ్చింది.. కానీ అదే కసితో మళ్లీ పోరాటం చేసింది.
ఒంటరి పోరాటంతో లేడీ టైగర్ అనిపించుకున్న ఇనయా (Inaya Sultana) :
గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా కలిసి ఎన్నోసార్లు ఇనయాను టార్గెట్ చేశారు. కొన్ని సార్లు అసభ్యంగానూ ప్రవర్తించారు. కానీ వీటన్నింటినీ తట్టుకుని నిలబడింది. హౌస్‌లో తనకు ఎవరు మద్ధతుగా లేకున్నా, తాను కెప్టెన్ కాకుండా అడ్డుకున్నా ఓపికగా భరించింది. కానీ సీజన్‌కి చివరి కెప్టెన్‌గా.. సీజన్‌లో ది బెస్ట్ కెప్టెన్‌గా నిలిచింది. మగవాళ్లలో రేవంత్, ఆడవాళ్లలో ఇనయాలు టైటిల్ విన్నర్ అని అంతా భావించారు. వివిధ ఛానెళ్లు పెట్టే ప్రైవేట్ ఓటింగ్స్ కూడా ఇవే చెప్పేవి.
ఇప్పుడు ఇంట్లో వున్న శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ కంటే ఇనయాకు ఎక్కువే ఓట్లు పడ్డాయి. కానీ వారిని సేవ్ చేసి ఆమెపై వేటు వేయడం వెనుక రాజకీయాలు ఏంటో తెలియదు గానీ... బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం షాకే. దీంతో ప్రేక్షకులు, ఇనయా అభిమానులు బిగ్‌బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. మరొకరిని సేవ్ చేసేందుకు ఇనయాను బలి చేశారని ఆరోపిస్తున్నారు. ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని కాదని లేడి సింగాన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
వారానికి రూ.లక్ష చొప్పున పారితోషికం (Inaya Sultana Remunration):
బిగ్‌బాస్‌కు ముందు వరకు ఇనయా ఎవరో తెలియదు. రామ్ గోపాల్ వర్మ (RGV) తో చేసిన డ్యాన్స్‌తో బాగా పాపులరై బిగ్‌బాస్ ఇంట్లో స్థానం దక్కించుకుంది. కానీ బిగ్‌బాస్‌లో ఆటతీరుతో క్రేజ్ దక్కించుకుంది. ఇదిలావుండగా 14 వారాలు బిగబాస్‌లో వున్నందుకు ఇనయాకు ఎంత ముట్టిందనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తొంది. వారానికి లక్ష చొప్పున రూ.14 లక్షలను ఆమె పారితోషికం కింద అందుకుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం వుందో మాత్రం తెలియదు. ఒకవేళ నిజమైతే మాత్రం ఇనయాకు బాగానే ముట్టినట్లే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments