BiggBoss: ఒకే బెడ్‌పై ఇనయా, రాజ్.. పూల్‌లో శ్రీహాన్ పాడుపని, ఇంటి సభ్యుల ఆగ్రహం

  • IndiaGlitz, [Thursday,September 29 2022]

గడిచిన మూడు వారాలుగా చప్పగా సాగుతోన్న బిగ్‌బాస్ 6 నాలుగో వారానికి ట్రాక్‌లో పడింది. సైలెంట్‌గా వున్న వారు కెమెరా స్పేస్ కోసం రంగంలోకి దిగడంతో ఈ సోమవారం నుంచే హౌస్ రణరంగంగా మారింది. ఇక శ్రీసత్య- అర్జున్, ఆరోహి- ఆర్జే సూర్యలు రొమాన్స్ మొదలుపెట్టడంతో అటు నుంచి కూడా ఆడియన్స్‌కి వినోదం లభిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బీబీ హోటల్‌ , గ్లామ్ ప్యారడైజ్‌ హోటల్స్‌గా కంటెస్టెంట్స్ విడిపోయారు. ఇందులో కొందరు బీబీ హోటల్ సిబ్బందిగా, ఐదుగురు అమ్మాయిలు గ్లామ్ హోటల్ సిబ్బందిగా, మిగిలిన వారు గెస్టులుగా వ్యహరిస్తున్నారు.

అతిథుల నుంచి ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వారికి కెప్టెన్సీ పోటీదారులుగా అవకాశం లభిస్తుంది. కంటెస్టెంట్స్ అందరిలోకి అర్జున్ నుంచి శ్రీసత్య బాగా డబ్బులు తీసుకుంది. హోటల్ టాస్క్‌ను సాకుగా చెప్పి కంటెస్టెంట్స్ తమ కోరికలు తీర్చుకుంటున్నారు. అయితే మొదటి రోజు చాలా ఫన్నీగా నడిచిన ఈ టాస్క్.. రెండో రోజుకి మాత్రం గొడవలు, వాగ్వాదాలతో సాగింది. సహజంగానే ప్రతి బిగ్‌బాస్ సీజన్‌లోనూ హోటల్ టాస్క్ రోటీనే. అయితే కొత్త కంటెస్టెంట్స్ రావడంతో పాటు వారి పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ వుండే టాస్క్ కావడంతో ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అది ఏ మాత్రం ఎక్కడం లేదు. పొరపాటున చేయి తగిలితేనే నాకు ఇష్టం వుండదు, అక్కడ చేయి వేశాడు, ఇక్కడ వేశాడు అంటూ నానా గొడవ చేసే శ్రీసత్య... ఈ టాస్క్‌లో మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ చేతులు వేయించుకుంది. అంతేనా డబ్బుల కోసం అర్జున్‌తో రాసుకుపూసుకు తిరుగుతోంది.

ఇక రెండు మూడు రోజులు డామినేట్ చేసిన ఇనయా సుల్తానా కూడా తేలిపోయింది. సూర్య గజిని క్యారెక్టర్ చేస్తుంటే.. అతనికి ప్రేయసిని గుర్తుచేసేలా ఇనయ నటన కాస్త ఓవరైంది. ఇక అర్థరాత్రి సమయంలో రాజ్, ఇనయాలు ఒకే బెడ్‌పై ముచ్చట్లు పెట్టారు. అంతేనా అతనిపై కాసేపు పడుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇది రొమాంటిక్ యాంగిల్ ద్వారా షోని మరింత రక్తికట్టించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక రేవంత్ చేత ఇనయా కాళ్లు పట్టించుకుంది. ఇందుకోసం కొంత అమౌంట్‌ని రేవంత్‌కి ఇచ్చింది.

మరోవైపు... సుదీప- ఫైమాల మధ్య ఫైట్ కూడా ప్రేక్షకులను అలరించింది. బాత్రూమ్ యాక్సెస్‌ని ఫైమా కొందరికే ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది సుదీప. దీనిపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాత్రూమ్‌లోకి ఎవరూ వెళ్లకుండా రేవంత్ కాపలా కాస్తాడు. అతని పరిస్ధితిని చూసి రేవంత్ , ఆదిరెడ్డి నవ్వుకుంటారు. దీనికి ‘‘నవ్వండి బ్రో.. బిగ్‌బాస్ సీజన్ 6 టైటిల్‌ని నేను పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తా’’ అని రేవంత్ అంటాడు. ఇదే సమయంలో రాత్రి పూట ఎవరు బాత్రూమ్‌కి వెళ్లినా రూ.500 చెల్లించాలని.. దొంగతనంగా వెళితే రూ.1000 ఫైన్ కట్టాల్సి వుంటుందని సుదీప చెప్పింది. అయితే 500 కట్టాల్సి వస్తుందని శ్రీహాన్ పూల్‌లోకి దిగి ఓ పాడుపని చేశాడు. దీనిపై అందరికీ డౌట్ వచ్చినా ఇనయా, రేవంత్‌లు మాత్రమే శ్రీహాన్‌ని ప్రశ్నించారు.

ఇకపోతే.. గ్లామ్ ప్యారడైజ్ మేనేజర్ ఫైమా అందరికంటే ఎక్కుగా రూ.5,400 సంపాదించింది టాప్‌లో నిలిచింది. దీంతో ఆమెకు ఓ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదేంటంటే... బీబీ హోటల్‌పైనా ఆమెకు అజమాయిషీ ఇచ్చాడు. అంతేకాదు బీబీ హోటల్‌ స్టాఫ్‌గా వున్న వారిలో ఇద్దరిని ఉద్యోగంలోంచి తీసేసి కెప్టెన్సీ కంటెండర్‌ కాకుండా చేసి, మిగిలిన ముగ్గురిని గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌ ఉద్యోగులుగా మార్చుకోవచ్చని చెప్పాడు. దీంతో రేవంత్, బాలాదిత్యలను ఉద్యోగం నుంచి తీసేసింది ఫైమా. ఇక సీక్రెట్ టాస్క్ సరిగా చేయనందున చంటిని కెప్టెన్సీ కంటెస్టెంట్‌ కాలేడని బిగ్‌బాస్ చెప్పాడు.