సూర్య తెగ నచ్చేస్తున్నాడు... బిగ్‌బాస్ ముందు ఓపెన్ అయిన ఇనయా
Send us your feedback to audioarticles@vaarta.com
ముందురోజు ఎపిసోడ్లో గలాటా గీతూ, ఫైమాలను సీక్రెట్ రూమ్‌కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి సభ్యులపై గాసిప్స్ చెప్పమని గీతూని ఆదేశించాడు బిగ్‌బాస్. వున్నవి లేనివి కల్పించి , మాంచి మసాలా దట్టించి చెప్పడంలో దిట్ట అయిన మన గీతూ దొరికిందే ఛాన్స్ అని ఇనయా- సూర్యల మధ్య ఏదో వుందని చెప్పింది. ఇనయాకు ఆయనపై రగులుతోందని.. సూర్య పెద్దగా రెస్పాండ్ కావడం లేదని కామెంట్ చేసింది. అటు సత్యని గోకడానికి అర్జున్ ట్రై చేస్తున్నాడని.. బిగ్‌బాస్ హౌస్‌లో వుండేందుకా, నిజంగానే ఆమెపై ప్రేమ వుందో తెలియడం లేదని గీతూ అంది. శ్రీహాన్‌తో శ్రీసత్య డ్యాన్స్ చేస్తుంటే అతని ముఖం మాడిపోయి కనిపించిందని చెప్పింది. బాలాదిత్య మాట్లాడితే.. దీపు దీపు అంటున్నాడని, నాకు మండుతోందని గీతూ అంది. ఇనయా విషయంలో చెప్పినదంతా గాసిప్‌గానే భావించారు ప్రేక్షకులు. కానీ దీనిని నిజం చేస్తూ ఓపెన్ అయ్యింది ఇనయా.
ఆమెను కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించిన బిగ్‌బాస్.. ఓ కేక్ ముక్కని పెట్టి, దీనిని తినాలంటే ఇంట్లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాలని ఆదేశించాడు. దీనికి తనకు సూర్య అంటే చాలా ఇష్టమని, రోజురోజుకు నచ్చేస్తున్నాడని... అతనే తన క్రష్ అని చెప్పింది. అలాగే అర్జున్ వాసంతికి దగ్గరవుతున్నాడని.. వారిద్దరూ భవిష్యత్తులో ఒక జంటగా మారొచ్చని ఇనయా తెలిపింది. దీనికి సంతృప్తి చెందిన బిగ్‌బాస్.. కేకును తీసుకుని నచ్చిన వాళ్లతో షేర్ చేసుకోమని చెప్పాడు.
ఇక... శ్రీహాన్, చంటి కాళ్లకు వ్యాక్సింగ్ (కాళ్ల మీద వెంట్రుకలు పీకడం) చేయాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. అంతే వాళ్లిద్దరిని గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లి.. శ్రీసత్య, గీతూ, ఇనయా, వాసంతి, కీర్తి చుట్టూ చేరారు. ఇలాంటి చెత్త టాస్కులు వినడానికే ఇబ్బందిగా వుంటే.. అది కూడా అమ్మాయిల చేత చేయించడం మరింత జుగుప్సగా అనిపించింది. ఆ తర్వాత ఇంటి సభ్యులను స్కూల్ పిల్లలుగా మార్చేశాడు బిగ్‌బాస్. ఆ స్కూల్‌కి మాస్టర్‌గా బాలాదిత్యను నియమించారు. అంతే బాలాదిత్యకు కంటెస్టెంట్స్ చుక్కలు చూపించారు. అతనిని ఓ రేంజ్లో ఆడుకున్నారు. వీరందరిలో ఫైమా కాస్త ఫర్వాలేదనిపించింది. మొత్తం మీద బిగ్‌బాస్ షో చాలా చప్పగా సాగింది. ఎలాంటి అలకలు, గొడవలు లేక ఫన్నీ టాస్కులతో ఇంటిని వినోదభరితంగా మార్చేశారు. గొడవల్ని ఇష్టపడేవాళ్లకి ఇది నచ్చకపోవచ్చు.
ఇకపోతే.. ఈ వారం నామినేషన్స్‌లో ఆదిరెడ్డి, ఇనయ సుల్తానా, వాసంతి, చలాకీ చంటి, ఫైమా, అర్జున్ కళ్యాణ్, మెరీనా, బాలాదిత్య వున్నారు. అయితే అన్ అఫీషియల్ పోల్ ప్రకారం ఇనయ సుల్తానా టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత వారం కెప్టెన్సీ టాస్క్‌లో పిట్ట కథతో ఇనయాకు భారీ హైప్ వచ్చింది. అలాగే నిన్న నామినేషన్స్ సందర్భంగా నేను హౌస్‌లోనే వుండి.. టైటిల్ కొట్టి తీసుకెళ్తా అని శపథం చేయడంతో మరోసారి ఆడియన్స్ ఇనయాకు ఓట్లు గుద్దినట్లుగా తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com