రేవంత్‌ను రెచ్చగొట్టేందుకు ప్లాన్లు... ఇనయాకు మళ్లీ నిరాశే
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్‌లో తనేనే టార్గెట్ చేసి... టాస్క్‌లోనూ తనపైనే ఫోకస్ చేయడంతో ఇనయా తీవ్రంగా బాధపడుతోంది. ఫ్రెండ్ అనుకున్న ఫైమా తనను శత్రువులాగా ట్రీట్ చేయడం.. ఆమె కారణంగా కెప్టెన్సీ పోటీదారుగా సెలెక్ట్ కాలేకపోవడంతో ఇనయా బాగా హర్ట్ అయ్యింది. బిగ్‌బాస్ మైండ్ గేమ్ కన్నా ఫిజికల్‌గా ఆడే ఆట ఇవ్వడంతో కంటెస్టెంట్స్ కింద మీద పడుతున్నారు. జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఫిజికల్ అవ్వకపోతే.. కంటెంట్ ఎలా వస్తుంది, తాము జనం దృష్టిలో ఎలా పడతామని భావిస్తున్నారో ఏమో కానీ ఇంటి సభ్యులు ఎవ్వరూ తగ్గడం లేదు.
నిన్నటి పాము - నిచ్చెన టాస్క్ కంప్లీట్ కావడంతో ఈ రోజు బిగ్‌బాస్ ‘‘నాగమణుల’’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో బాలాదిత్య, రాజ్, రేవంత్, శ్రీసత్య, మెరీనాలు మణులు కాపాడుకోవాలి... ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్‌లు మణులను దక్కించుకోవాలి. ఈ టాస్క్‌లో ఇరు జట్ల సభ్యులు వీరోచితంగా పోరాడారు. నిచ్చెన టీమ్ ఎంత ప్రయత్నించినా చాలా మణులను కీర్తి, ఫైమాలు కొట్టేశారు. వేలు విరిగి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. ఫైమా బాగా కష్టపడి మంచి మార్కులు కొట్టేసింది.
మరోవైపు నిన్నటి టాస్క్‌లో ఔటైన శ్రీసత్య, ఇనయా, వాసంతి, రోహిత్‌లను పోటీలో నిలబెట్టేందుకు బిగ్‌బాస్ వీరికి మరో ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా వీరు తమ ప్రత్యర్ధులకు స్టిక్కర్లు అంటించాలి. అయితే వారి చుట్టూ గీసిన సర్కిల్ దాటి బయటకు రాకుండానే ఆ పని చేయాల్సి వుంటుంది. ఈ టాస్క్‌లోనూ ఇనయా, వాసంతిలకు అదృష్టం కలిసి రాలేదు. రోహిత్, శ్రీసత్య మాత్రం బాగా ఆడి.. మరోసారి కెప్టెన్సీ టాస్క్‌లో పోటీపడే ఛాన్స్ కొట్టేశారు.
ఇక ఈరోజు ఆదిరెడ్డి- రేవంత్‌ల మధ్య వివాదం నడిచింది. రేవంత్‌ను జస్ట్ తోసేసినా ఫిజికల్ అవుతున్నాడని.. కావాలని రెచ్చగొడితే ఆడకుండా పక్కకు తప్పుకుంటారని పాము టీమ్ వాళ్లు ప్లాన్ చేశారు. దీనిని విన్న రేవంత్.. ఫిజికల్ అయితే తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ.. ఆదిరెడ్డి, ఫైమాలు రేవంత్‌కు మరింత కోపం తెప్పించేందుకు ప్రయత్నించాడు. గోరు తగిలినా తాను ఫిజికల్ అవుతానని రేవంత్ వ్యాఖ్యానించగా.. ఇదేమైనా రెజ్లింగా అని ఆదిరెడ్డి కామెంట్ చేశాడు. నువ్వు నామినేషన్‌కి కారణాలు వెతుక్కునే పనిలో వుండు అని రేవంత్ అన్నాడు. నీ విషయంలో అయితే అలాంటి ఇబ్బంది లేదని.. అరగంటకొక రీజన్ ఇస్తావని ఆదిరెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
ఆట ముగిసే సమయానికి పాముల టీమ్ గెలిచినట్లుగా సంచాలక్‌గా వ్యవహరించిన వాసంతి, ఇనయా ప్రకటించారు. దీంతో ఆ జట్టులోని ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. శ్రీహాన్ ఈ టీమ్‌లోనే వున్నప్పటికీ.. గత వారం నాగ్ ఇచ్చిన పనిష్‌మెంట్ కారణంగా కెప్టెన్సీకి అర్హత కోల్పోయాడు. అతడి స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇచ్చుకోవచ్చని బిగ్‌బాస్ ఆదేశించడంతో శ్రీసత్యకు ఛాన్స్ ఇచ్చాడు. వీరితో పాటు గోల్డెన్ నాగమణి వున్న మెరీనా కూడా కెప్టెన్సీ పోటీదారుగా మారారు. అయితే ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఫైమా గెలిచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments