BiggBoss: బిగ్‌బాస్ 6 చివరి కెప్టెన్‌గా ఇనయా, శివంగిలా పోరాడి నేరుగా సెమీస్‌లోకి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో ప్రస్తుతం కుటుంబ సభ్యుల కలయిక జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఆదిరెడ్డి భార్యా కూతురు, రాజశేఖర్ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఎవరికి తోచిన విధంగా వారు తమ వాళ్ల ఆటతీరు మెరుగు పరచుకునేందుకు సలహాలు ఇచ్చారు. ఇక బుధవారం ఫైమా తల్లి, శ్రీసత్య తల్లిదండ్రులు, రోహిత్ అమ్మగారు ఇంట్లోకి వచ్చి సందడి చేశారు. తర్వాతి రోజు శ్రీహాన్ ప్రియురాలు సిరి హనుమంతు, అతని కొడుకు చైతన్య, ఇనయా తల్లి నజ్బూర్, కీర్తి భట్ స్నేహితుడు మహేశ్‌లు హౌస్‌లో సందడి చేశారు. దీంతో ఇంటిలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి రేవంత్ కోసం ఎవరొస్తారు.. ఆయన కోసం బిగ్‌బాస్ ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడోనని హౌస్‌మెట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూశారు.
దీనికి చెక్ పెడుతూ.. నిండు గర్భిణి అయిన తన భార్య యోగక్షేమాల గురించి తెలుసుకోవాలనుకుంటున్న రేవంత్‌కు అతని సతీమణి అన్వితతో మాట్లాడే అవకాశం కల్పించాడు. నువ్వు లేకపోవడం చాలా బాధగా వుందని రేవంత్ ఎమోషనల్ అయ్యాడు .. భార్యతో ఏదో చెప్పబోతుండగా లైన్ కట్ చేశాడు రేవంత్. ఆ కాసేపటికే రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మీ. ఎలాంటి కల్మషం లేకుండా అందరినీ పేరు పేరునా పలకరించింది. ఆ గెడ్డం ఏంట్రా అని రేవంత్‌ని అడగ్గా... భార్య ప్రెగ్నెంట్ కదా, తీయొచ్చో లేదోనని అలా వుంచేశానని చెప్పాడు. ఏం పర్లేదని అమ్మ చెప్పడంతో రేవంత్ వెంటనే లోపలికి వెళ్లి ట్రిమ్ చేసుకుని వచ్చేశాడు. అనంతరం ఇంటి నుంచి తెచ్చిన పులిహోర, సున్నండలను నువ్వు, నీ ఫ్రెండ్స్ తినాలని చెప్పింది. అలాగే ప్రతీసారి ఏడవటం, కోప్పడటం చేయొద్దని .. నీ వీడియోలను నెట్లో పెట్టేస్తున్నారని జాగ్రత్తగా వుండమని హెచ్చరించింది. అంతేకాకుండా కెప్టెన్ హోదాలో వంటగదిలో రేషన్ దగ్గర కక్కుర్తి పడొద్దని సీతా సుబ్బలక్మీ కొడుక్కి చురకలు వేశారు.
ఇక తల్లిదండ్రులు, అన్నదమ్ములు దూరమై.. బంధువులు వున్నా పట్టించుకోక అనాథలా బతుకుతున్న కీర్తిని ఆమె హత్తుకున్నారు. ఇక నుంచి నువ్వు నా కూతురివి.. ఎప్పుడైనా ఇంటికి రావొచ్చునని చెబుతుంది. తర్వాత అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు సీతా సుబ్బలక్ష్మీ. అనంతరం అందరి దగ్గరా సెలవు తీసుకుని హౌస్‌ను వీడారు.
అనంతరం కెప్టెన్సీ టాస్క్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. ఎవరో కొద్దిమందికి కాకుండా ఇంట్లో వున్న అందరూ కెప్టెన్సీ పోటీదారులేనని.. అంతా పోటీపడొచ్చని చెప్పాడు. దీనిలో ఇంటి సభ్యుల మధ్యలో ఒక బంతిని పెట్టి.. ఎవరైతే ఆ బంతిని దక్కించుకుని పరిగెడతారో వారు , మరొకరిని గేమ్‌లోంచి ఎలిమినేట్ చేయొచ్చు. అలా ఒక్కొక్కరు పక్కకు తప్పుకోగా.. చివరికి కీర్తి, శ్రీసత్య, ఇనయా మిగిలారు. కీర్తి కూడా ఎలిమినేట్ అవ్వగా.. శ్రీసత్య- ఇనయాల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఎలాగైనా కెప్టెన్ కావాలనే పట్టుదలతో ఆడిన ఇనయా.. సత్యను నిలువరించి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6కి చివరి కెప్టెన్‌గా అవతరించి తన కలను, తల్లి కలను కూడా నెరవేర్చింది. అంతేకాదు.. నేరుగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. కానీ హౌస్‌లో అందరూ కెప్టెన్ అయి తాను కాలేకపోయినందుకు రోహిత్ చాలా బాధపడ్డాడు. ఇనయాను తనకు వెన్నుపోటు పొడిచిందంటూ ఎమోషనల్ అయ్యాడు.
మరోవైపు.. ఈ వారం కెప్టెన్ రేవంత్, కీర్తి తప్పించి అంతా నామినేషన్స్‌లో వున్నారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. రాజశేఖర్, రోహిత్‌లు డేంజర్ జోన్‌లో వుండటంతో వీరిలో ఒకరు హౌస్‌ను వీడే అవకాశం వుంది. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఎవరికి క్లాస్ పీకుతారో, ఎవరికి కాంప్లిమెంట్ ఇస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout