వాలీబాల్ ఆట నేపథ్యంలో..

  • IndiaGlitz, [Monday,January 22 2018]

బెల్లంకొండ శ్రీనివాస్.. నటించింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు. తను నటించిన ఈ మూడు సినిమాలు కూడా 30 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా తెరకెక్కాయంటే.. ఈ యంగ్ హీరో మార్కెట్ అర్ధం చేసుకోవచ్చు. బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి....వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు శ్రీ‌నివాస్‌. ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్లో సాక్ష్యం' సినిమాలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. వేస‌వి సంద‌ర్భంగా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే....రాజుగారి గది' తెరకెక్కించిన ఓంకార్ దర్శకత్వంలో.. శ్రీనివాస్ హీరోగా క్రీడా నేపథ్యంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీలో శ్రీనివాస్ ఒక వాలీబాల్ ఆటగాడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కథని తెరకెక్కించడం ఓంకార్ కి కొత్త, అలాగే తనకి కూడా కొత్తగానే ఉందని.. ఈ చిత్రం ప్రేక్షకులకి కూడా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మీడియాకి తెలిపారు శ్రీనివాస్. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధా మోహన్ ఈ మూవీని నిర్మించనున్నారు.

More News

మార్చిలో 'టాక్సీవాలా'

సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత.. ఆ చిత్ర క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా అని అత‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ అర‌డ‌జ‌ను చిత్రాల‌తో బిజీగా ఉన్నా.. వీటిలో 'టాక్సీవాలా' ముందుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మళ్ళీ బాలయ్య తోనే..

కొన్ని హిట్ కాంబినేషన్లు వెండితెరపై రిపీట్ అయితే చాలు..సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు.

వెంకీ త‌మ్ముడిగా రోహిత్‌?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ

‘శివ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున,దర్శకుడు రాంగోపాల్ వర్మ.

చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు అన్నయ్య‌లు

ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సంద‌ర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.