'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' ట్రైలర్ : కోరికని రెచ్చగోట్టెది సైతాన్.. ప్రాణం తీసేది దేవుడు

  • IndiaGlitz, [Saturday,June 12 2021]

కమెడియన్ ప్రియదర్శి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ లీడ్ పెయిర్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'. మనుషులు చేసే తప్పులు, క్రైమ్స్ చుట్టూ అల్లిన కథ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇదీ చదవండి: ఆకతాయిల తిక్క కుదిర్చిన పవన్ 'బంగారం' పాప!

ముందుగా చెప్పుకున్నట్లుగానే క్రైమ్, సెక్స్ అంశాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ప్రియదర్శి డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నీలోని కోరికని రెచ్చగొట్టి..నువ్వు తప్పు చేసేలా చేసి.. నువ్వు కష్టపడుతుంటే ఆనందించేవాడు సైతాన్.. నువ్వు తప్పు చేసిన వెంటనే చంపేసేవాడు దేవుడు' అని ప్రియదర్శి చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.

రూ.5 కోట్ల అవినీతి డబ్బు చుట్టూ ఏదో ఇంట్రెస్టింగ్ వ్యవహారం జరుగుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. నందిని రాయ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.

పోసాని కృష్ణ మురళి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. జూన్ 18న ఆహా ఓటిటిలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ప్రియదర్శి తన కెరీర్ లో చేస్తున్న మరో విభిన్నమైన అటెంప్ట్ ఈ వెబ్ సిరీస్.