రకుల్ విషయంలో మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి: ఢిల్లీ హైకోర్టు
- IndiaGlitz, [Wednesday,September 30 2020]
డ్రగ్స్ కేసులో మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా పలు కథనాలను వెలువరిస్తూ తనను మానసికంగా వేధిస్తోందని.. కాబట్టి ఆ కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును రకుల్ రెండోసారి ఆశ్రయించింది. రకుల్ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. కేంద్రంతో పాటు సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్ కౌన్సిల్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రకుల్ డ్రగ్స్ కేసు పూర్తయ్యే వరకూ మీడియాలో కథనాలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. రకుల్‌కు సంబంధించిన ఏ వార్తలూ ఇక మీదట ప్రింట్ చేయడం కానీ ప్రసారం చేయడం కానీ చేయవద్దని కోరింది. మీడియా రకుల్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ప్రస్తుతం రకుల్ హైదరాబాద్‌కు తిరిగొచ్చి షూటింగ్స్‌లో పాల్గొంటోంది.