రాజమౌళి చిత్రంలో మరోసారి...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది. కాగా ఈ చిత్రంలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం.
ఇది వరకు ఎన్టీఆర్‌తో హీరోయిన్‌గా రాజమౌళి దర్శకత్వంలోనే `యమదొంగ` చిత్రంలో నటించింది. అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదనేది సమాచారం. డి.వి.వి.దానయ్య మూడు వందల కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020లో సినిమా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments