In Secure: నవంబర్ 11న ''ఇన్ సేక్యూర్" విడుదల

  • IndiaGlitz, [Tuesday,November 01 2022]

ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సిహెచ్ క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం ఇన్ సేక్యూర్ నవంబర్ 11న గ్రాండ్ గా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ... తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా ఇన్ సేక్యూర్ మూవీని నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో సీతారామం ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు, నవంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం మా బ్యానర్లో నాలుగో చిత్రం గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం గత చిత్రలాగానే ఈచిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు

ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి ,సమర్పణ: రంజిత్ కోడిప్యాక , సహకారం : సిహెచ్ క్రాంతి కిరణ్ , పాటలు : బస్వాగాని భాస్కర్ , మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి