పాత‌బ‌స్తీ నేప‌థ్యంతో..

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

పోలీస్ పాత్రలకి, మాస్ మహారాజా రవితేజకి విడదీయరాని బంధం ఉంది. పోలీస్ కథలతో గతంలో ర‌వితేజ హీరోగా వచ్చిన 'వెంకీ', 'విక్రమార్కుడు', 'మిరపకాయ్', 'పవర్' వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే కోవలోకి మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని చేర్చేందుకు.. మరో పోలీస్ కథతో సిద్ధపడిపోయారు ఈ మాస్ మహారాజా.ఆ చిత్ర‌మే 'టచ్ చేసి చూడు'.

ఈ సినిమా ద్వారా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పాత బస్తీలో కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా రవితేజ చేసిన పోలీస్ పాత్ర ఉంటుందని సమాచారం. ఆ క్రమంలో సాగే ప్రతీ సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తోంది. రవితేజ సరసన రాశి ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

వారిని టార్గెట్ చేసుకున్న తరుణ్

కుటుంబ సమేతంగా చూడ దగ్గ ప్రేమ కథా చిత్రాల్లో నటించి..

రాజశేఖర్.. మూడు కొత్త ప్రొజెక్ట్స్‌

దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత విజయాన్ని చవిచూసారు ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు డా.రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'పి.ఎస్‌.వి గరుడవేగ 126.18 ఎమ్‌' చిత్రంతో ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ సీనియర్ హీరో.

దుబాయ్ పయనమౌతున్న 'సాహో'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సాహో'.

'యు-టర్న్' అతిథులెవ‌రంటే..

2016లో కన్నడంలో వచ్చిన 'యు-టర్న్' సినిమాని.. తెలుగు, తమిళ భాషల్లో అదే పేరుతో అందాల తార‌ సమంత క‌థానాయిక‌గా పునఃనిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కన్నడంలో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన విలేకరి పాత్రని ఈ రెండు భాషల్లో సమంత పోషించనున్నారు.

రజనీ మాటల రచయితే కమల్ కి కూడా..

లోక నాయకుడు కమల్ హాసన్,సూపర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన