ఎన్టీఆర్ తండ్రి పాత్రలో...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `అరవింద సమేత`. పూజాహెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఫస్టాఫ్‌లో సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాత్ర సిద్ధార్థ్ గౌతమ్ పేరుతో కనిపిస్తే.. సెకండాఫ్‌లో రాయల సీమ నేపథ్యంలో ఇదే పాత్ర వీర రాఘవగా కనిపించనుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో మెగా కాంపౌండ్ యాక్టర్ నాగబాబు నటించబోతున్నారట. అంటే నాగబాబు ఫ్యాక్షన్ లీడర్‌గా కనపడబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments