మ‌హేష్ ప్ర‌తి హిట్ చిత్రంలోనూ..

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

సినిమాలు విజయం సాధించడానికి కథ, కథనంతో పాటు కాంబినేషన్‌లు కూడా కీలకపాత్రలు పోషిస్తాయి. ఆ కాంబినేషన్‌లలో హీరో, హీరోయిన్‌  ఉండొచ్చు.. హీరో, డైరెక్టర్ ఉండొచ్చు.. హీరో, నిర్మాణ సంస్థ ఉండొచ్చు. ఇవేకాకుండా.. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ (లేదా) విల‌న్ కాంబినేషన్ కూడా సినిమా విజయానికి దోహదపడుతూ ఉంటుంది. అటువంటి కలయికే సూపర్ స్టార్ మహేశ్ బాబు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌లది.

మ‌హేష్ తొలి చిత్రం ‘రాజకుమారుడు’ నుంచి తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ వరకు త‌న కెరీర్‌లో హిట్ చిత్రాలుగా నిలిచిపోయే ప్రతీ చిత్రంలోనూ (‘శ్రీమంతుడు’ని మిన‌హాయిస్తే) ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించ‌డం విశేషం. ‘రాజకుమారుడు’, 'మురారి', ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాల్లో  ప్రకాష్ రాజ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానో లేదంటే విల‌న్‌గానో సంద‌డి చేసి మ‌హేష్ విజ‌యాల్లో భాగ‌స్వామ్యం వ‌హించారు.

తాజాగా.. ‘భరత్ అనే నేను’తో ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగించారు. మొత్తానికి.. మ‌హేష్ ప్ర‌తి హిట్ చిత్రంలోనూ ప్ర‌కాష్ రాజ్ సంద‌డి చేశార‌న్న‌మాట‌. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమిటంటే.. మ‌హేష్ ఫ్లాప్ చిత్రాల‌లోనూ ప్ర‌కాష్ రాజ్ ఉన్న‌ప్ప‌టికీ.. ఆల్ మోస్ట్ ప్ర‌తి హిట్ చిత్రంలోనూ ఉండ‌డం కొస‌మెరుపు.