కలకత్తాలో 20 రోజుల పాటు..
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది శతమానం భవతి`, మహానుభావుడు`తో మంచి విజయాలను అందుకున్నారు యువ కథానాయకుడు శర్వానంద్. ఈ విజయాలు అందించిన ఉత్సాహంతో.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఈ యంగ్ హీరో. స్వామి రా రా`,కేశవ` వంటి హిట్ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ఒక సినిమా...`అందాల రాక్షసి`, కృష్ణగాడి వీర ప్రేమగాధ` వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ హనురాఘవపూడితో మరో సినిమాను చేస్తున్నారు శర్వానంద్. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.
ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అలాగే ఈ మూవీ తొలి షెడ్యూల్ కలకత్తాలో 20 రోజుల పాటు సాగనుందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పడిపడి లేచే మనసు` అనే వైవిధ్యభరితమైన పేరుని ఖరారు చేసారని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనుంది చిత్రబృందం .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments