సహజనటి పాత్రలో...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ రోజుకోరీతిలో వార్తల్లో నిలుస్తున్న చిత్రం 'యన్.టి.ఆర్'. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ ఇది. 'యన్.టి.ఆర్ కథానాయకుడు', 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా సినిమా రూపొందుతోంది.
అందులో తొలి పార్ట్ 'యన్.టి.ఆర్ కథానాయకుడు' జనవరి 9న విడుదల కానుంది. కథానాయకుడు పార్ట్‌లో ఎన్టీఆర్ హీరోగా విజయవంతం సాధించిన చిత్రాల్లో కొన్ని సన్నివేశాలను పాటలను చిత్రీకరిస్తున్నారు.
అలనాటి తారలందరినీ నేటి తరం తారలతో రీప్లేస్ చేస్తూ సినిమాకు గ్లామర్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకుల్, తమన్నా, అనుష్క, మాళవికా నాయర్ ఇలా తారలందరూ ఈ చిత్రంలో మెరవనున్నారు. తాజాగా ఈ చిత్రంలో 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కూడా నటించనున్నారు.
సహజనటి జయసుధ పాత్రలో పాయల్ నటిస్తుంది. సినిమా టీజర్‌ను డిసెంబర్ 2న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందట. ఈ సినిమా ఆడియో డిసెంబర్ 16న తిరుపతిలో జరగనుంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com