గ్రేటర్‌లో చెరువులన్నీ ఇళ్లవగా... తిరిగి ఇళ్లన్నీ చెరువులయ్యాయి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరి పాపమో.. నేడు ఎన్నో కుటుంబాలకు శాపంలా మారింది. అభం శుభం తెలియని చిన్నారులను సైతం పొట్టనబెట్టుకుంది. ముఖ్యంగా రెండు రోజులపాటు వర్షం నగరాన్ని ప్రశ్నల వలయంలోకి నెట్టివేసింది. అసలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులెన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయనేది మొట్టమొదట ఉత్పన్నమవుతున్న ప్రశ్న. నిజానికి హైదరాబాద్‌లో ఎన్ని చెరువులున్నాయో తెలిస్తే షాకవుతారు. హైదరాబాద్‌లో 180కి పైగా గొలుసుకట్టు చెరువులున్నాయని చరిత్ర చెబుతోంది. నంబర్ వింటేనే ఆశ్చర్యమేస్తోంది కదా.. కానీ ఇప్పుడు మనకు తెలిసిన ఎన్ని చెరువులన్నాయి? మహా అయితే ఓ పది చెరువులు. అంతకు మించి తెలియక పోవచ్చు.
హైదరాబాద్‌లోని చెరువులు..
హుస్సేన్, ఉస్మాన్, హిమయత్ సాగర్లతో పాటూ మంత్రాల చెరువు, కొత్త చెరువు, ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, సూరారం చెరువు, లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, మేకంపూర్ చెరువు, నల్లచెరువు, పల్లె చెరువు, దుర్గం చెరువు, రామంతపూర్ చెరువు, సఫీల్ గూడ చెరువు, అల్వాల్ చెరువు, సరూర్ నగర్ చెరువు, అమీనాపూర్ చెరువు, జీడిమెట్ల చెరువు, బంజారా చెరువు (బంజారాహిల్స్), షామీర్ పేట్ చెరువు, నారాయణరెడ్డి కత్వా, బాచారం కత్వా, హీరా కత్వా, రాయిన్‌చెరువు, మాలోనికుంట, అంట్ల మాసమ్మకుంట, మైసమ్మ చెరువు, పెద్ద చెక్ డ్యాం, మెట్టు కత్వా, బుంగ కత్వా, బూబాగడ్డ చెక్ డ్యాం, ఎర్రబండ చెక్‌డ్యాం, బంధంకుంట, బైరాంఖాన్ చెరువు, ఈదులచెరువు, దిల్‌వార్‌ఖాన్ చెరువు, పోల్కమ్మ చెరువు, అంతాయపల్లి చెరువు, కుంట్లూర్ చెరువు, కంబాలకుంట, మాసబ్ చెరువు, వడ్లకుంట, కొత్త చెరువు, బందకుంట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ చెరువు, శ్యామలకుంట సనత్‌నగర్, మైసమ్మకుంట, చాపల చెరువు. ఇవి కాకుండా... తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్ చెరువు, కోమ కుంట, కోమార్‌కుంట, గొల్లవాని కుంట, భజన్‌సాహికుంట, బొంగలకుంట, షాన్ కీసమున కుంట, హెచ్‌ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్ లే అవుట్ చెరువు, బండకుంట, సుదర్శన్ చెరువు, అంజయ్య చెరువు తదితర చెరువులున్నాయి.
చెరువులన్నీ ఏమై పోయాయి?
పైన 180 చెరువుల్లో సగం చెరువులు కూడా ఇవ్వలేదు. కానీ ఆ కొన్ని చెరువుల్లో ఎన్ని చెరువులు మనకు తెలుసు? మహా అయితే 10 నుంచి 15 తెలిసుండవచ్చు. మరి మిగిలిన చెరువులన్నీ ఏమైపోయాయి? భారీ సంఖ్యలో చెరువులు ఇళ్లుగా మారిపోయాయి. వీటికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. డ్రైనేజీలను శుభ్రం చేస్తుండగా వచ్చిన బాటిళ్లను చూపించి బాధ్యతా రాహిత్యం.. ఇందుకే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయంటూ ఓ ప్రచారం. అది నిజమే కావచ్చు. కానీ చెరువులకు చెరువులను లేపేసి ఇళ్లు కట్టిన వారిని ఏమనాలి? దానికి పర్మిషన్ ఇచ్చేవారిని ఏమనాలి? ఇదంతా ఎవరి బాధ్యతారాహిత్యం.. దీనికి ఎవరు బలయ్యారు? కొన్ని కుటుంబాలకు కుటుంబాలే పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. చెరువుల్లో పారాల్సిన నీళ్లు రోడ్డెక్కాయి.. ఇళ్లు చెరువులను తలపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ ఎన్ని చెరువులు ప్రక్షాళనకు నోచుకున్నాయి? అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాపం ఎవరిది? ఎంతో ముందుచూపుతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను నిజాం కాలంలో అభివృద్ది చేశారు. ఇన్ని వసతులున్న సమయంలో మరింకెంత అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిస్తే ఇక ముందు మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com