AP:సుపరిపాలనలో ఏపీకి దేశంలోనే గుర్తింపు.. స్కోచ్ అవార్డుల్లో ముందంజ..
Send us your feedback to audioarticles@vaarta.com
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి సీఎం వైయస్ జగన్ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటి వద్దకే పరిపాలనను తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టి దూసుకుపోతున్నారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన విద్య, వైద్యంను ప్రజలకు చేరవేస్తూ పేదవాడికి అండగా నిలబడుతున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా నాయకుడిగా పేరు గడించారు. సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది.
ప్రతి ఇంటికి బంధువుగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది వరకు ఏ ప్రభుత్వాలూ చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని చేర్చిన జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఊరూరా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి వద్దకు రేషన్, పెన్షన్.. ఇలాంటి అద్భుత విధానాలతో ప్రతి ఇంటికి సీఎం జగన్ బంధువయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది.
దేశంలోనే 3వ స్థానం..
పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక "స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023"లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ..ఇప్పుడు మూడో స్థానానికి ఎగబాకింది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధానంగా గ్రామీణ పాలనలో ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ పట్ల ఇతర రాష్ట్రాలు కూడా మొగ్గు చూపుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మాత్రమే..
తాజాగా స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు. మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం 14వ స్థానంలో, తమిళనాడు 6వ స్థానంలో ఉన్నాయి. అంటే ప్రజాపాలన పట్ల సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాయకుడికి ముందుచూపు ఉంటే రాష్ట్రం సుపరిపాలనలో దూసుకువెళ్తుంది అనడానికి జగన్ పాలనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments