NTR:మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్.. తారక్ క్రేజ్ మామూలుగా లేదుగా..
Send us your feedback to audioarticles@vaarta.com
RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు వార్2 సినిమాలో కూడా నటించనున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో తారక్ విలన్ రోల్ చేయనున్నారు. ఇప్పటికే ఈ రోల్‌కు సంబంధించి టెస్ట్ కట్స్ కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొనున్నాడు. యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో 'వార్ 2' తెరకెక్కుతోంది. దీనికి ముందు 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3' చిత్రాలు వచ్చాయి.
ఈ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ (టైగర్), హృతిక్ రోషన్ ('వార్'లో కబీర్), షారుఖ్ ఖాన్ (పఠాన్) క్యారెక్టర్లు ఆధారంగా స్పై యూనివర్స్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఇప్పుడు ఆ తరహాలో 'వార్ 2'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ బేస్ చేసుకుని మరిన్ని స్పై ఫిలిమ్స్ చేయాలని నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నారట. 'వార్ 2'కు మాత్రమే ఎన్టీఆర్ క్యారెక్టర్ పరిమితం కాదని యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాకుండా ఇందులో సింగిల్ హీరో ఫిల్మ్ కూడా ఎన్టీఆర్కి ఉండబోతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక'వార్ 2' విషయానికి వస్తే ఇండియన్ స్పై ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్. హృతిక్ రోషన్, ఆయనకు మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ మొదలైంది. ఓ నెల తర్వాత తారక్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వేకప్ సిద్', 'ఏ జవానీ హై దివాని', 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్‌గతా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం 'దేవర' సినిమాతో షూటింగ్‌తో తారక్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, హీరోయిన్‌గా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కూడా రెండు పార్ట్‌లుగా రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments