స‌మంత‌ని ప్రేమించే పాత్ర‌లో..

  • IndiaGlitz, [Friday,April 13 2018]

మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు. మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, షాలిని పాండే, క్రిష్, తరుణ్ భాస్కర్ ఇత‌ర‌ ప్రధాన పాత్రధారులు.

ఇప్పటికే కీర్తి సురేష్, సమంత పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ లను విడుదల చేశారు. తాజాగా.. విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ లుక్‌లో స్కూటర్‌పై హెల్మెట్ పెట్టుకుని మెడలో కెమెరాతో నవ్వుతున్న విజయ్‌ని చూడొచ్చు.ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో విజయ్ దేవరకొండ (పాత్ర పేరు.. విజయ్ ఆంటోనీ) కనిపించనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సమంత (మధురవాణి) కూడా జర్నలిస్ట్ కావడంతో.. ఆమెను ప్రేమించే పాత్రలో విజయ్ కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్న క‌రుణాక‌ర‌న్‌

సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ' (ప్రచారంలో ఉన్న పేరు).

బోయపాటి సినిమాకు రెడీ అవుతున్న చరణ్

'రంగస్థలం' ఇచ్చిన విజయంతో.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్. ఈ రోజు (శుక్ర‌వారం) జరగబోయే విజయోత్సవ వేడుకలలో కూడా చరణ్ పాల్గోనున్నారు.

'గ్లామ‌ర్ గ‌ర్ల్స్' ప్రారంభం

విక్ట‌రీ మూవీస్ ప‌తాకంపై గుల్ మ‌హ్మ‌ద్, అక్బ‌ర్, స‌లీమ్,  జి. శంక‌ర్ గౌడ్ తెలుగు, హీందీ భాష‌ల్లో  

ఏప్రిల్ 14న 'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'మ‌హాన‌టి'.  వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.

శ్రీరెడ్డి పై 'మా' నిషేధం ఎత్తివేత‌... లైంగిక వేధింపుల‌పై క్యాష్ క‌మిటీ!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఫిలిం ఛాంబ‌ర్, డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, `మా`