డార్క్ కామెడి చిత్రంలో...
- IndiaGlitz, [Sunday,July 23 2017]
అందాల నాయిక నయనతార ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలతో బిజి బిజీగా ఉంది. తెలుగులో బాలకృష్ణ 102వ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కళ్యాణ్ నిర్మాత. ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. ఇదే నెలలో నయనతార మరో తమిళ సినిమాలో నటించడానికి సిద్ధమైంది. ఈ తమిళ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో డార్క్ కామెడి జోనర్లో ఉంటుందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుంది.