కమల్ హెల్త్ గురించి ఇంపార్టెంట్ అప్ డేట్..

  • IndiaGlitz, [Monday,July 25 2016]

యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల చెన్నైలోని త‌న నివాసం లో మెట్ల పై నుంచి ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవ‌ల క‌మ‌ల్ కాలికి ఆప‌రేష‌న్ చేయ‌డం జ‌రిగింది. ఆప‌రేష‌న్ చేసిన అనంత‌రం వైద్యులు క‌మ‌ల్ హాస‌న్ ను క‌నీసం నెల రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పార‌ట‌. అయితే...ఆప‌రేష‌న్ అనంత‌రం ఈ నెలాఖ‌రు నుంచి శ‌భాష్ నాయుడు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. డాక్ట‌ర్స్ క‌నీసం నెల రోజులు ఖ‌చ్చితంగా రెస్ట్ తీసుకోవాల‌ని చెప్ప‌డంతో శ‌భాష్ నాయుడు షూటింగ్ వాయిదా ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ నుంచి శ‌భాష్ నాయుడు తాజా షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు.