'డేటా చోరీ' కేసులో కీలక వ్యక్తి.. ఆయన దొరికితే..!

  • IndiaGlitz, [Wednesday,March 06 2019]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన హైదరాబాద్ పోలీసులు.. డేటాకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందుకు సంచలన నిజాలు వెల్లడించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన అశోక్‌‌ పోలీసుల ఎదుట హాజరవ్వకపోవడంతో లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరించారు.

అమెజాన్‌‌ను కోరాం..

రహస్యంగా ఉండాల్సిన సమాచారం ‘ఐటీ గ్రిడ్’ కు చెందిన సర్వర్ లో చేరింది. దీని ద్వారా ఆ సమాచారాన్ని ‘సేవామిత్ర’ వాడుకుంటోంది. సర్వర్లలో నిక్షిప్తం చేసిన పూర్తి డేటా ఇవ్వాలని అమెజాన్ సంస్థను కోరాము. ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు పంపడం జరిగింది అని అంజనీకుమార్ మీడియాకు వివరించారు.

ఇదీ అసలు కథ..

క్షేత్ర స్థాయిలో ఆధార్ నెంబర్, విద్య, సామాజిక వర్గం వివరాలు సేకరిస్తారు. ఆ వివరాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ పరిశీలిస్తుంది. సేవా మిత్ర’ వెబ్‌సైట్‌లో బూత్ కన్వీనర్, డ్యాష్ బోర్డు వివరాలు ఉన్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తారు. ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగి తెలుసుకుని, సర్వేయర్లు ఈ సమాచారాన్ని టీడీపీ బూత్ లెవెల్ అధికారులకు చేరవేస్తారు. ఓటర్ అభిప్రాయం, సదరు ఓటర్ అక్కడే ఉంటున్నారా? లేదా? అన్న దానిపై సర్వే చేస్తున్నారు. అటువంటి వారిని లక్ష్యంగా చేస్తూ సర్వే చేస్తున్నారు అని అసలు వ్యవహారాన్ని అంజనీకుమార్ బయటపెట్టారు.

కీలక వ్యక్తి.. కోడ్ భాషతో..!

ఈ వ్యవహారం మొత్తం హైదరాబాద్‌లో జరిగింది.. అందుకే ఇక్కడే కేసు నమోదు చేశాము. ఐపీసీ 420,490,467,468, 471,120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ నిందితుడు అశోక్‌ను త్వరలో పట్టుకుంటాము. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని కోడ్ భాషతో పిలుస్తున్నారు. ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నాము. ఆ కీలక వ్యక్తి ఎవరన్నది త్వరలోనే తేలుస్తాము అని అంజనీకుమార్ మీడియాకు వివరించారు. ఆ కీలక వ్యక్తి దొరికితే అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న పెద్ద తలకాయలేవి.. నేతలు ఎవరు..? అనే విషయాలు తెలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

కీలక మలుపు తిరిగిన కేసు..

డేటా చోరీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఐటీ గ్రిడ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై ఏపీ టీడీపీ కన్నెర్రజేస్తోంది. మా డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని కేసు పెట్టాలని తెలుగుతమ్ముళ్లు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ సర్కార్‌పై పరువునష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మాటల యుద్ధం, విమర్శలు, ఆరోపణలు చేసుకుంటుండగా... తాజా పరిణామంతో ఈ కేసులో కీలక మలుపు తిరిగిందని.. అయితే కోర్టులు దాకా పంచాయితీ వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో మరి వేచి చూడాల్సిందే.

More News

కోల్‌క‌త్తాకు 'RRR'

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'.

ఇది ప్రజాస్వామ్యమా?.. దగాస్వామ్యమా?: పవన్

ప్రజా పోరాట యాత్రలో భాగంగా మంగళవారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా ప‌ల్నాడులో పర్యటించారు. ఈ సందర్భంగా పల్నాడు ముఖ‌ద్వార‌మైన స‌ర‌స‌రావు పేట‌లో నిర్వహించిన బ‌హిరంగ స‌భలో పవన్ మాట్లాడుతూ

ఫీమేల్‌ బడ్డీ డ్రామా 'కిట్టి పార్టీ' లోగో విడుదల!

ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా 'కిట్టి పార్టీ'. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

'మా' మేనిఫెస్టో విడుదల చేసిన నరేశ్

'నువ్వా.. నేనా' అంటూ 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో శివాజీ రాజా, నరేశ్ పోటాపోటీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా తహతహలాడుతుండగా

జిమ్ ట్రైనర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌‌కు మహేశ్ ఫిదా

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు అందం.. బాడీ ఫిట్‌‌నెస్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనకు నాలుగు పదుల వయస్సు వచ్చినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు.