నిజాముద్దీన్ ఘటనతో 'నమాజ్‌'లపై కీలక ప్రకటన!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో బాంబులాంటి షాకింగ్ విషయాన్ని వినాల్సి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిజాముద్దీన్ ఘటన జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో ముస్లిం మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రేపు నమాజ్‌లు వద్దు

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహ్మదీయులు మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే నమాజ్‌లు చేసుకోవాలని దారుల్ ఉలుమ్ దేవ్‌బంద్ ఫత్వా జారీ చేయడం జరిగింది. గురువారం రాత్రి దారుల్ ఉలుమ్ దేవ్‌బంద్ ఉలేమా కోరీ ఇస్‌హాక్ పేరుతో ఈ ఫత్వా జారీ అయింది. అంతేకాదు.. ఐదుగురికి మించి మసీదులో ప్రార్ధనలకు వెళ్లరాదని ఒకింత హెచ్చరించింది కూడా. కాగా.. రేపు శుక్రవారం కావడంతో ముస్లింలు పెద్ద ఎత్తున మసీదులకు నమాజ్‌కు వెళ్తుంటారు. ఇప్పటికే జనసమూహం అన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించట్లేదు. ఇదిలా ఉంటే.. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సూచించారు. మరోవైపు.. కరోనా లక్షణాలుంటే ఏ మాత్రం అలక్ష్యం.. దాచిపెచిపెట్టడం లాంటి చేయొద్దని ఫత్వాలో నిశితంగా పేర్కొన్నారు. నిజాముద్దీన్ ఘటన ఎఫెక్ట్‌తో ఇలా ఫత్వా జారీ చేయడం జరిగింది.

More News

షాకింగ్ కేరళలో గర్భిణికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా గంటగంటకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కేరళ విషయానికొస్తే..

ఏపీలో గంటగంటకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలు కాస్త కోలుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలో బాంబులాంటి షాకింగ్ విషయాన్ని వినాల్సి వచ్చింది.

ప్రధాని మరో కీలక ప్రకటన చేయబోతున్నారా..!?

రోనాపై యుద్ధంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక ప్రకటన చేయబోతున్నారా..? లాక్‌డౌన్ విషయంలో ప్రధాని సంచలన ప్రకటన చేయబోతున్నారా..? ఇంతకీ మోదీ మనసులో ఏముంది..?

14 నుంచి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు గాను యావత్ దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఆ లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఇండియా

విజయ్..‘కొండంత’ సాయానికి లేటయ్యిందేం!?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ విపత్తులు వచ్చినా ముందుగా స్పందించి తన వంతుగా విరాళం ప్రకటించి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రియల్ హీరో అనిపించుకుంటూ ఉంటాడు.