Poonam Pandey:ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబూ.. నేను చనిపోలేదు: పూనమ్ పాండే
Send us your feedback to audioarticles@vaarta.com
తాను క్యాన్సర్‌తో చనిపోలేదని బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఓ వీడియో విడుదల చేసింది. కేవలం సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు శుక్రవారం ఉదయం పాండే వ్యక్తిగత మేనేజర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలసిందే.
"ఇవాళ ఉదయం మాకు చాలా కష్టమైనది. మా ప్రియమైన పూనమ్ సర్వైకల్(గర్భాశయ) క్యాన్సర్‌తో మరణించారు. ఈ విషయాన్ని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాము. ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఖ: సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని, సహకరించాలని కోరుకుంటున్నాము" అని తెలిపారు. దీంతో ఆమె మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
అయితే చాలా మంది మాత్రం పూనమ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మృతి చెందితే ఆమె కుటుంబసభ్యులు ఎందుకు స్పందించలేదు.. పూనమ్ డెడ్ బాడీ ఫొటోలు, అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు ఎందుకు బయటకు రాలేదని సందేహాలు లేవనెత్తారు. వారు అనుకున్నట్లే తాజాగా ట్విస్ట్ ఇచ్చింది పూనమ్.
ఓ వీడియోలో మాట్లాడుతూ.."నేను చనిపోలేదు. బ్రతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ వల్ల నాకు ఏమి కాలేదు. కానీ భాదకరమైన విషయం ఏంటంటే.. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వేలాది మంది మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు. HPV వ్యాక్సిన్ అనేది ఈ జబ్బును ముందుగా గుర్తిస్తుంది. ఈ వ్యాధితో ఎవరూ చనిపోకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత" అంటూ వివరణ ఇచ్చింది.
దీంతో నెటిజన్లు ఆమె ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి పబ్లిసిటీ అంటూ దుమెత్తిపోస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి అనేక మార్గాలున్నాయని.. కానీ ఇలా బతికి ఉండి చనిపోయినట్లు చెప్పడం ఏంటని ఫైర్ అవుతున్నారు. కాగా పూనమ్ పాండే తొలి నుంచి వివాదాస్పదమైన వ్యక్తిగా నిలిచారు. నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులారిటీ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments