షాకింగ్.. గంగవ్వకు అనారోగ్యం.. హౌస్‌లో ఉండలేనంటూ ఆవేదన
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ షోలోకి ఇవాళ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. షాకింగ్‌గా గంగవ్వ అనారోగ్యం పాలైంది. స్వేచ్ఛగా తిరిగే పక్షిని తీసుకొచ్చి పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుందో.. ప్రస్తుతం ఆమె పరిస్థితి అలా ఉంది. ఇక ఇవాళ సుజాత బాగా ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నించినట్టుగా అనిపించింది. ఇంతకు మించి చెప్పుకోదగ్గ అంశాలేవీ నేటి షోలో లేవు. నువ్వు బాయ్‌ఫ్రెండ్‌గా ఎవర్ని భావిస్తావో చెప్పు అంటూ సుజాతను హారిక అడగటంతో షో స్టార్ట్ అవుతుంది. అనంతరం హారిక, అభిజిత్‌ల మధ్య కాన్వర్సేషన్.. అఖిల్, మొనాల్‌ల మధ్య అంత సీన్ లేదంటూ మీటింగ్. నోయెల్ దగ్గర సుజాత కన్నీళ్లు.. హారిక అడిగిన విషయమంతా చెప్పుకుంది. నేను నిన్ను సిస్టర్లా ట్రీట్ చేస్తానని నోయెల్ చెప్పాడు.
ఇక ముక్కు అవినాష్ ఎంట్రీ.. అద్భుతమైన ఏవీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. అమ్మ.. అవినాష్.. రావడం రావడమే పులిహోర కలపడం స్టార్ట్ చేసేశాడు. మొత్తానికి ఫన్ కోసమే అయినా మన ఇద్దరు దేవదాసులకు కాంపిటేషన్ ఇవ్వడానికే వచ్చాడేమో అన్నట్టుగా ఉంది అవినాష్ బిహేవియర్. ఇక మొనాల్, అఖిల్‌ల కాన్వర్సేషన్. తనను పని చేయట్లేదంటున్నారని ఫీల్ అయిపోయాడు. ఇక నోయెల్, అమ్మ రాజశేఖర్ల కామెడీ.. ఒకరి ర్యాక్‌లు మరొకరికి మార్చేశారు. ఇక కల్యాణిని ఏడిపించాలని ప్రాంక్ చేస్తే.. సుజాత అడ్డంగా దొరకిపోయింది. ఆ తరువాత అంతా కలిసి ఫైనల్లీ ముక్కు అవినాష్‌ని బక్రాను చేశారు. చివరకు అవినాష్‌కి లేడీ గెటప్ వేసి ఓ ఆటాడుకున్నారు.
గంగవ్వతో కలిసి అవినాష్ ర్యాంప్ వాక్ చేయడం ఫన్నీగా అనిపించింది. మొత్తానికి సందడి సందడిగా గడిచిపోయింది. అభితో సుజాత మీటింగ్. చాలా ఓవర్ థింకింగ్ చేసినట్టు అనిపించింది. అభిని నువ్వు నా చెల్లి అని ఎందుకు అన్నావని ప్రశ్నించింది. అసలా మాట ఎలా అంటావు? ఆ మాట అనే విధానం తప్పంటూ రచ్చ చేసింది. ఆల్రెడీ నోయెల్ దగ్గర కొళాయి విప్పిన సుజాత.. మరోసారి అభి దగ్గర ఎమోషనల్ అయింది. సడెన్‌గా గంగవ్వ అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. తనను బాగా చూసుకుంటున్నారని.. కానీ నాకు ఫుడ్ పడట్లేదని చెప్పింది. తనకు బిగ్‌బాస్ హౌస్ పడట్లేదని తెలిపింది. తాను ఇక హౌస్‌లో ఉండలేనని చెప్పకనే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. పల్లెటూరులో స్వేచ్ఛగా తిరిగి వచ్చిన మహిళ కావడంతో.. నాలుగు గోడల మధ్య ఉండలేక తీవ్ర ఆవేదనకు గురవుతోంది. తొలి సీజన్లో సంపూర్ణేష్ బాబు ఎలా ఫీల్ అయ్యాడో.. ఇప్పుడు గంగవ్వ అలాగే ఫీల్ అవుతోంది. మరి ఆమె ఇకమీదట షోలో కొనసాగుతుందో బయటకు వెళ్లిపోతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com