ఈ నెల 18న 'అబ్బాయితో అమ్మాయి' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా ఒక చిత్రానికి పాటలు స్వరపరచాలంటే ముందు ఆయనకు కథ నచ్చాలి. అందుకే ఇళయరాజా ఓ సినిమాకి పాటలు స్వరపరిస్తే.. కచ్చితంగా ఆ చిత్రకథలో దమ్ము ఉందని అనుకోవచ్చు. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'అబ్బాయితో అమ్మాయి' ఈ కోవకే చెందుతుంది.
జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా పాటలు స్వరపరిచారు.
ఈ చిత్రం పాటలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. అత్యంత వైభవంగా హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకలో చిత్ర సంగీతదర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇంకా పలువురు అతిరధ మహారధులు ఈ వేడుకలో పాల్గొంటారు.
చిత్రవిశేషాలను రమేశ్ వర్మ చెబుతూ- ''నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి'' అని చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నమైన లవ్ స్టోరీతో హార్ట్ టచింగ్ గా సాగే చిత్రం ఇది. ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ మాస్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఉంటుంది. రమేశ్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. చాలా ట్రెండీగా, పొయిటిక్ గా తీశారు. ఆయనకు మంచి విజన్ ఉంది. ఇళయరాజా స్వరపరచిన పాటలు ఓ హైలైట్. రెండు పాటలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరించాం. నాగశౌర్య టైలర్ మేడ్ పాత్ర చేశాడు. తన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. కథానాయిక పల్లక్ లల్వాని అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. లవ్ స్టోరీస్ లో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచే చిత్రం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, రావు రమేశ్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: రహ్మాన్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments