నితిన్‌తో మ‌ళ్లీ... ఇల్లీ బేబీ!

  • IndiaGlitz, [Monday,July 08 2019]

'దేవ‌దాసు' సినిమా చేసి తెలుగు కుర్ర‌కారును త‌న న‌డుమొంపు సొగ‌సుల‌తో క‌ట్టిప‌డేసింది ఇలియానా. ఈ గోవాపాల‌కోవా ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో ప్ర‌ముఖ హీరోలంద‌రితోనూ దాదాపుగా సినిమాలు చేసింది. అలా ఆమె న‌టించిన 'రెచ్చిపో'లో హీరో నితిన్‌. దాదాపు ద‌శాబ్దం క్రితం ఆ సినిమా వ‌చ్చింది. సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ, నితిన్‌, ఇలియానా మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రం బాగా కుదిరింది. ఇప్ప‌టికీ నితిన్ గోవా వెళ్లిన ప్ర‌తిసారీ ఇలియానాను ప్ర‌త్యేకంగా ప‌ల‌క‌రిస్తుంటారు.

ఈ విష‌యాన్ని నితిన్ ఆ మ‌ధ్య చెప్పారు. ఇలియానా కూడా అత‌ని రాక‌కు సంబంధించి ఫొటోలు అప్ప‌ట్లో పోస్ట్ చేసింది. ఈ చిర‌కాల మిత్రులు మ‌ర‌లా తెర‌పై క‌నిపించ‌డానికి స‌ర్వం స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాకు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌కుడు. భవ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్లున్నారు. మూడో నాయిక‌గా ఇలియానా పేరు వినిపిస్తోంది. ఒక‌వేళ ఇలియానా డాటెడ్ లైన్స్ లో సంత‌కం చేసిన‌ట్ట‌యితే ర‌వితేజ స‌ర‌స‌న న‌టించిన 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' త‌ర్వాత ఆమె చేస్తున్న తెలుగు సినిమా ఇదే అవుతుంది.

More News

నీవల్లైతే చేస్కో... నెటిజెన్ కు తాప్సి సవాల్

తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆ మాట‌కొస్తే జ‌ర అగ్రెసివ్‌గానే ముందుకు వెళ్తోంది. అవ‌త‌లి వ్య‌క్తి ఎవ‌రూ ఏంటి? అన్న‌ది ప‌ట్టించుకోకుండా `నీవ‌ల్లైతే చూస్కో.. చేస్కో` అని అంటోంది.

చెర్రీ... ఇన్‌స్టాగ్రామ్‌లో చేరీ!

చెర్రీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. ఇక‌పై వ‌రుస‌గా పిక్స్ పోస్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కేవ‌లం ఫేస్‌బుక్‌లోనే ఉన్నారు.

హార‌ర్‌ను మించిన ఎమోష‌న్ సినిమాలోఉంది! - సందీప్ కిషన్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక.

ఈనెల 27న విశాల్‌ 'అయోగ్య' తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన చిత్రం 'అయోగ్య'. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది.

జులై 19న 'మిస్ట‌ర్ కెకె' రిలీజ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో