నితిన్‌తో మళ్లీ... ఇల్లీ బేబీ!
Send us your feedback to audioarticles@vaarta.com
`దేవదాసు` సినిమా చేసి తెలుగు కుర్రకారును తన నడుమొంపు సొగసులతో కట్టిపడేసింది ఇలియానా. ఈ గోవాపాలకోవా ఆ తర్వాత టాలీవుడ్లో ప్రముఖ హీరోలందరితోనూ దాదాపుగా సినిమాలు చేసింది. అలా ఆమె నటించిన `రెచ్చిపో`లో హీరో నితిన్. దాదాపు దశాబ్దం క్రితం ఆ సినిమా వచ్చింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ, నితిన్, ఇలియానా మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం బాగా కుదిరింది. ఇప్పటికీ నితిన్ గోవా వెళ్లిన ప్రతిసారీ ఇలియానాను ప్రత్యేకంగా పలకరిస్తుంటారు.
ఈ విషయాన్ని నితిన్ ఆ మధ్య చెప్పారు. ఇలియానా కూడా అతని రాకకు సంబంధించి ఫొటోలు అప్పట్లో పోస్ట్ చేసింది. ఈ చిరకాల మిత్రులు మరలా తెరపై కనిపించడానికి సర్వం సన్నాహాలు జరుగుతున్నాయట. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లున్నారు. మూడో నాయికగా ఇలియానా పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఇలియానా డాటెడ్ లైన్స్ లో సంతకం చేసినట్టయితే రవితేజ సరసన నటించిన `అమర్ అక్బర్ ఆంటోని` తర్వాత ఆమె చేస్తున్న తెలుగు సినిమా ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments