ఆ ప్రొడ్యూసర్ పై కేసు పెడతాను - ఇలియానా
Friday, August 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఆంఖే. 2002లో రూపొందిన ఆంఖే చిత్రానికి సీక్వెల్ గా ఆంఖే 2 రూపొందుతుంది. ఈ చిత్రంలో అమితాబ్, అర్షద్ వార్సిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గౌరంగ్ దోషి నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర విశేషాలను తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత గౌరంగ్ దోషి మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఇలియానా నటిస్తున్నట్టు ప్రకటించారు.
అంతే కాకుండా...ఇలియానాకి సంబంధించిన వీడియోని ఈవెంట్ లో ప్రదర్శించారట. అయితే...ఈ చిత్ర నిర్మాత ఇలియానాని సంప్రదిస్తే...నో చెప్పిందట. అయినప్పటికీ.. తన అనుమతి లేకుండా నటిస్తున్నాను అని ప్రకటించడం...అంతే కాకుండా తనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించడంతో ఇలియానాకి బాగా కోపం వచ్చిందట.అందుకే.. నిర్మాత గౌరంగ్ పై ఇలియానా కేసు పెట్టనుందని తెలిసింది. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments