టాలీవుడ్ లో పనిచేయాలనుంది - ఇలియానా
Send us your feedback to audioarticles@vaarta.com
నేను టాలీవుడ్ లో పనిచేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు. నేను బాలీవుడ్ లోకి వెళ్లగానే నాకు ఇక్కడ నుండి అవకాశాలు రావడం మానేశాయి. అలాగే నేను కూడా ఎవరినీ ఫోన్ చేసి నాకొక సినిమా ఉంటే చెప్పు యాక్ట్ చేస్తాను అని అడిగే టైప్ కాదు. బాలీవుడ్ లో నేను వెళ్లగానే బిజీ అయిపోయాను. ఇక్కడివారు నన్ను సినిమాల కోసం కాంటాక్ట్ చేసేవారు కాదు. నేను బాలీవుడ్ వెళ్లినా పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో టచ్ లోనే ఉన్నాను. హైదరాబాద్ నా రెండో ఇల్లులాగా భావిస్తాను. ఇక్కడ దారుల్లో ఎలా వెళ్లాలో కూడా నేనింకా మరచిపోలేదు. నాకు అంతగా ఇష్టమైన సిటీ ఇది. అవకాశాల కోసం చూస్తున్నాను. వస్తే తప్పకుండా నటిస్తానని అంటుంది జగనసుందరి ఇలియానా. రీసెంట్ గా ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం సిటీకి వచ్చిన ఇలియానా తన మనసులో మాటను ఇలా షేర్ చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com