'డిక్టేటర్' లో ఇలియానా..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహాం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి నిర్మిస్తుండడం విశేషం. బాలయ్య 99వ సినిమాగా రూపొందుతున్నడిక్టేటర్ దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఢిల్లీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఈ మూవీలో ఓ ఐటం సాంగ్ ఉందట. ఈ ఐటం సాంగ్ ను ఇలియానా తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. ఆమె అడిగిన రెమ్యూనరేష్ ఇస్తామనడంతో దాదాపు ఇలియానా ఐటం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ ఐటం సాంగ్ షూట్ చేయనున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments