'అమర్ అక్బర్ ఆంటోనీ' లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఇలియానా..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహా రాజా రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది...ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఇలియానా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పగా, తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆమెకు ఇదే మొదటిసారి.. పాత్ర డిమాండ్ చేయడంతో ఇలియానా పాత్రకు తనతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీనువైట్ల ఇలా ప్లాన్ చేయగా నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేయడం విశేషం..
రవితేజ హీరో గా నటిస్తుండగా రవితేజ తో ఇలియానా కి ఇది నాలుగో సినిమా.. ఇప్పటికే ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది దాంతో సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ నవంబర్ 10 న ఎంతో గ్రాండ్ గా జరగనుంది.. నవంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com