Ileana D'Cruz : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పిల్లాడి పేరేంటో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
గోవా బ్యూటి ఇలియానా తల్లి అయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు. ఆగస్ట్ 1న తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇలియానా తెలిపారు. ఈ మేరకు చిన్నారి ఫోటోను షేర్ చేశారు. అంతేకాదు.. తన కొడుకు పేరును కూడా ఇలియానా వెల్లడించారు. చిన్నారి పేరు ‘‘కోవా ఫినిక్స్ డోలన్’’గా ఆమె తెలిపారు. ఈ ప్రపంచంలోకి తమ చిన్నారి కుమారుడికి స్వాగతం పలకడానికి తాము ఎంత సంతోషంగా వున్నామో మాటల్లో చెప్పలేం’’ అంటూ ఇలియాన పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఇలియానాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
పెళ్లికాకుండా గర్భం దాల్చడంతో ట్రోలింగ్ :
ఇకపోతే.. తాను గర్భందాల్చినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇలియానా ప్రకటించారు. అయితే పెళ్లికాకుండా ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇది సాంప్రదాయమేనా..? నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు అంటూ దారుణంగా పోస్టులు పెట్టారు. అయినప్పటికీ ఇలియానా వాటిని పట్టించుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని బిడ్డకు జన్మనిచ్చింది.
టాలీవుడ్‌ను వదిలేసిన గోవా భామ :
కాగా.. ఒకప్పుడు టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్ . కుర్రకారును తన నడుము అందంతో గిలిగింతలు పెట్టి అగ్ర కథానాయకులందరి సరసనా నటించింది. అయితే బాలీవుడ్‌కు వెళ్లి దక్షిణాదిని నిర్లక్ష్యం చేసింది. అక్కడు అనుకున్న స్థాయిలో సినిమాలు హిట్ కాకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది ఇలియానా పరిస్ధితి. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా వుంటున్న ఇలియానా.. తన ఫుల్ ఫోకస్ హిందీ ఇండస్ట్రీపై పెట్టింది. ఈమె చివరిసారిగా 2018లో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీలో కనిపించి తెలుగువారిని అలరించింది.
🎉👶 Exciting news! 🙌🥳
— Ileana D’cruz Fans (@ileana_dcruzFAN) August 5, 2023
Our slaying queen #IleanaDcruz is now a proud momma to a handsome baby boy! 💙👶
Let's shower her and the little one with love and blessings as they embark on this beautiful journey of parenthood! 💗❤️
Much love from your fans 🤗 May god bless you… pic.twitter.com/6E9KHL281q
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com