చిత్ర పరిశ్రమపై ఇలియానా ఘాటు వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

నడుము సుందరి ఇలియానా గతంలో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. పోకిరి తర్వాత కుర్రకారంతా ఇలియానా జపం చేశారు. కెరీర్ బాగానే సాగుతున్న టైంలో ఇలియానా రాంగ్ స్టెప్ వేసింది. బాలీవుడ్ ని కూడా దున్నేయడానికి వెళ్ళింది. కానీ ఆమె అంచనాలు తారుమారయ్యాయి.

అరకొర ఆఫర్స్ తప్ప అక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. మధ్యలో ప్రేమ వ్యవహారంతో ఫిట్ నెస్ పై పట్టు కోల్పోయింది. తన మునుపటి లుక్ కోల్పోయింది. ఇలియానా బాలీవుడ్ కి వెళ్లడంతో ఆమెకు సౌత్ లో కూడా ఆఫర్స్ నిల్ గా మారిపోయాయి.

ఇదీ చదవండి: వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్

అప్పుడప్పుడూ ఇలియానా చిత్ర పరిశ్రమ గురించి చేసే కామెంట్స్ వివాదంగా మారుతున్నాయి. తాజాగా ఇలియానా ఫిల్మ్ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమ క్రూరమైనది. ఇక్కడ అవకాశాలు దక్కడంతో సమానత్వం ఉండదు.

పాపులారిటీనే ఇక్కడ బిగ్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే పాపులారిటీ కోల్పోతామో అప్పుడే ఇక్కడ మనకి పని ఉండదు. నా విషయంలో కూడా అదే జరిగింది అని ఇలియానా తెలిపింది. ఇలాంటి క్రూరమైన పరిస్థితులు ఉన్న చోట నిలదొక్కుకోవడం చాలా కష్టం అని ఇలియానా అభిప్రాయ పడింది. ప్రస్తుతం ఇలియానా 'అన్ ఫెయిర్ అండ్ లవ్లీ' అనే చిత్రంలో నటిస్తోంది.

More News

మరింత ప్రియం కానున్న దేశీయ విమాన ప్రయాణం

దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ శుక్రవారం పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది.

నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుని అడ్డగించి డాక్టర్ దంపతులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది.

పవన్ సినిమాలో బాలీవుడ్ హీరో, హీరోయిన్.. ఎంట్రీ ఎప్పుడంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు

విరించి హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లక్షల్లో ఫీజు వేయడంతో అంత ఫీజు ఎలా అయ్యింది?

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేయండి: అమూల్‌కు పెటా వినతి

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) ఇండియా అమూల్ సంస్థని కోరింది. పెటా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ శోధి..