ఇలియానా బ్రేకప్ చెప్పేసిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బ్యూటీ తన బాయ్‌ఫ్రెండ్ అండ్రూ నీబోన్కి గుడ్‌బై చెప్పేసిందా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అలా చెప్పడానికి ప్రధాన కారణం.. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అండ్రూ నీబోన్‌తో ఉన్న ఫొటోలను డిలీట్ చేసింది. లండన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ అండ్రూతో ఇలియానా డేటింగ్లో ఉందని చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ విడిపోయారని వార్తలు వినపడ్డప్పటికీ ఇద్దరూ జంటగా కనపడుతూ వచ్చారు. ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరు దీనిపై ఎక్కడా స్పందించలేదు. పలు సార్లు ఇద్దరు అన్యోన్యంగా ఉండే ఫొటోలను షేర్ చేస్తూ ఈ ఫొటోలను తీసింది అండ్రూనే అంటూ కామెంట్స్ పెట్టడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి రివీల్ చేస్తూ వచ్చింది. దీనిపై ఎవరు ప్రశ్నించినా ‘‘నా వ్యక్తిగత జీవితం వేరు.. ప్రొఫెషనల్ లైఫ్ వేరు.. దేనికవే ప్రత్యేకం. రెండింటినీ కలిపి చూడను. నా వ్యక్తిగత వివరాలు చెప్పనవసరం లేదు. అయితే ఇద్దరం వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉన్నాం’’ అంటూ ఇలియానా గడుసుగా సమాధానం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారినట్లున్నాయి. ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో అయ్యారు. ఇలియానా అండ్రూతో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం కొసమెరుపు. అయితే అసలు ఇద్దరి మధ్య నిజంగానే చెడిందా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు నిజం తెలిసేలా కనపడటం లేదు. పలు తెలుగు, హిందీ, ఒకట్రెండు తమిళ చిత్రాల్లో నటించిన ఇలియానా అండ్రూతో రిలేషన్ మొదలెట్టాక సినీ రంగానికి పూర్తిగా దూరమైంది. ముఖ్యంగా టాలీవుడ్‌ను అసలు పట్టించుకోనే లేదు. హిందీలో అడపా దడపా ఒకట్రెండు సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య అమ్మడు రవితేజతో కలిసి ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments