ఇలియానా అందుకు భయపడిందట..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇలియానా ఓ వెలుగు వెలిగింది. ఈ గోవా భామ ఒకప్పుడు కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్‌తో అగ్ర హీరోయిన్గా నిలిచింది. పవన్‌కల్యాణ్, మహేశ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడింది. టాలీవుడ్లో ఈమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ కూడా బర్ఫీ, రుస్తుం వంటి సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఆదరణ దక్కడంతో తెలుగు సినిమాలను పట్టించుకోవడం మానేసింది. దీంతో ఇలియానా వైపు చూడటం మానేశారు మన తెలుగు దర్శక నిర్మాతలు.
కెరీర్ బాగా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడింది. ఎప్పుడూ పెళ్లి చేసుకుంటావు అని అడిగిన ప్రతిసారి సమాధానం దాటవేస్తూ వచ్చిన ఇలియానా లవ్ బ్రేకప్ అయ్యింది. దాంతో ఈమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది. ఫిట్నెస్ మీద కేర్ తీసుకోకపోవడంతో లావుగా తయారైంది. బయటకు వస్తే ఎవరైనా ఫొటోలు తీస్తారేమోనని భయపడి బయటకు రావడం కూడా మానేసింది. మానసికంగా కృంగిన ఇలియానా రోజులో 12 మాత్రలు కూడా వేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఇలాగైతే కష్టమని సన్నిహితులు సూచిచడంతో తిరిగి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి సన్నబడింది. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుందీ గోవా పాలకోవా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout