ఎస్.పి.బి కి ఇళయరాజా నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఇళయరాజా అంటే ఒకప్పుడు హిట్ కాంబినేషన్. మ్యూజిక్‌లో వీళ్ళ కాంబోలో సూపర్‌హిట్ పాటలు వచ్చాయి. ఇద్దరు మంచి మిత్రులు కూడా. అయితే ఈ మిత్రుల మధ్య కూడా ఓ సమస్య వచ్చి ఇళయరాజా బాలుకు కోర్టు నోటీసులు పంపాడు. అసలు విషయంలోకి వెళితే సింగర్‌గా యాబై ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలసుబ్రమణ్యం ఎస్.పి.బి 50 పేరుతో వరల్డ్ టూర్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రష్యా, మలేషియా, శ్రీలంక, దుబాయ్ తదితర ప్రాంతాల్లో పాటల కార్యక్రమాలను నిర్వహించారు.
అయితే అమెరికాలో ఈ ప్రోగ్రాం చేయడానికి ముందు బాలసుబ్రమణ్యంకు ఇళయరాజా కోర్టు నోటీసులు పంపాడు. తన అనుమంతి లేకుండా పాటలు పాడకూడదంటూ, అలా చేస్తే భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని చెప్పాడు. దీనిపై ఫేస్ బుక్‌లో ఎస్.పి.బాలసుబ్రమణ్యం స్పందించారు. తాను అమెరికాలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలను పాడనని, మిగతా సంగీత దర్శకుల కంపోజిషన్‌లో వచ్చిన పాటలను పాడుతానని, కచేరీ అనుకున్న ప్రకారమే జరుగుతుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout